Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

వాయుసేన వైస్‌ చీఫ్‌గా నగేశ్‌ కపూర్‌

భారత వైమానికదళ ఉప అధిపతి (వైస్‌ చీఫ్‌)గా ఎయిర్‌ మార్షల్‌ నగేశ్‌ కపూర్‌ 2026, జనవరి 1న బాధ్యతలు చేపట్టారు.  పదవీ విరమణ చేసిన ఎయిర్‌ మార్షల్‌ నర్మదేశ్వర్‌ తివారీ స్థానంలో ఆయన వచ్చారు. 1985లో జాతీయ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకుని 1986లో వాయుసేనలో చేరిన ఆయన.. మిగ్‌-21, మిగ్‌-29 యుద్ధ విమానాలు, శిక్షణ విమానాలు విస్తృతంగా నడిపారు. మొత్తం 3,400 గంటలసేపు లోహ విహంగాల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది.  వైస్‌ చీఫ్‌ కంటే ముందు ఆయన నైరుతి వాయుదళం ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌గా సేవలందించారు. 

Current Affairs

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లు

దేశీయంగా 2025 డిసెంబరులో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 డిసెంబరు వసూళ్లయిన రూ.1.64 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. దేశీయ విక్రయాల నుంచి వచ్చిన పన్ను ఆదాయ వృద్ధిలో మందగమనం, పన్ను కోతల వల్ల వృద్ధి తక్కువగా ఉంది. దేశీయ లావాదేవీల నుంచి స్థూల ఆదాయం 1.2% పెరిగి రూ.1.22 లక్షల కోట్లకు చేరింది. దిగుమతి చేసుకున్న వస్తువుల నుంచి ఆదాయం 19.7% వృద్ధితో రూ.51,977 కోట్లకు చేరుకుంది. డిసెంబరులో రిఫండ్‌లు 31% పెరిగి రూ.28,980 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్‌లను సర్దుబాటు చేశాక.. నికర జీఎస్‌టీ వసూళ్లు 2.2% వార్షిక వృద్ధితో రూ.1.45 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. 

Current Affairs

పొగాకు ఉత్పత్తులపై అధిక పన్ను

పొగాకు ఉత్పత్తులపై జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను)కి, అదనంగా ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది. ఇది 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ‘పొగాకుపై పన్ను విధానాలకు’ అనుగుణంగా ఈ చర్య చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో పొగాకుపై పన్నులను ఏటా సవరిస్తున్నారు. జీఎస్‌టీ అమలుకు ముందు భారత్‌లోనూ సిగరెట్లపై ఏటా ఎక్సైజ్‌ సుంకాన్ని సవరించేవారు. 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక గత ఏడేళ్లుగా ఎటువంటి మార్పులూ చేపట్టలేదు. జీఎస్‌టీలోని గరిష్ఠమైన 28% పన్నుతో పాటు పరిహార సుంకం మాత్రమే ఇప్పటివరకు విధిస్తున్నారు.

Current Affairs

గణాంకాల శాఖ కొత్త లోగో

గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ) 2026, జనవరి 1న కొత్త లోగోను విడుదల చేసింది. దేశ అభివృద్ధి ప్రక్రియలో డేటా ప్రాముఖ్యతను ఈ కొత్త లోగో వర్ణిస్తుందని వెల్లడించింది. లోగోలో ఉన్న అశోక చక్రం నిజానికి, పారదర్శకతకు, మంచి పరిపాలనకు గుర్తు కాగా.. రూపాయి చిహ్నం ఆర్థిక ప్రణాళికలో, విధాన రూపకల్పనలో, దేశ వృద్ధిలో గణాంకాల కీలక పాత్రను ప్రతిబింబిస్తుంది. అందులో ఉన్న అంకెలు, చిహ్నాలు ఆధునాతన డేటా వ్యవస్థను, స్టాటిస్టిక్స్‌ సైన్స్‌ను తెలుపుతాయని వివరించింది. 

Current Affairs

న్యూయార్క్‌ మేయర్‌గా సబ్‌వేలో మమ్దానీ ప్రమాణం

అమెరికాలోని న్యూయార్క్‌ నగర 112వ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్‌ మమ్దానీ ప్రమాణం చేశారు. మాన్‌హట్టాన్‌లోని ఓ చారిత్రక సబ్‌వే స్టేషన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఖురాన్‌పై ప్రమాణం చేసి.. న్యూయార్క్‌లో తొలి ముస్లిం మేయర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జోహ్రాన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందినవారు.

Current Affairs

ఐఎండీ వార్షిక నివేదిక

దేశంలో గతేడాది (2025)లో వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు కంటే 0.28 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. 2025 ఏడాదికి సంబంధించిన వాతావరణ నివేదికను 2026, జనవరి 1న విడుదల చేసింది. 1901లో ఉష్ణోగ్రతల నమోదు ప్రారంభించిన తర్వాత 2025.. ఎనిమిదో వేడి సంవత్సరంగా నిలిచింది.  2025 శీతాకాలంలో ఉష్ణోగత్రలు 1.17 డిగ్రీలు, ప్రీ-మాన్‌సూన్‌ (మార్చి-మే)లో 0.29, నైరుతి రుతుపవనాల కాలంలో 0.09 డిగ్రీలు ఎక్కువగా, పోస్ట్‌ మాన్‌సూన్‌ (అక్టోబరు-డిసెంబరు)లో 0.10 డిగ్రీలు తక్కువగా ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. 

Walkins

ఎన్ఆర్‌ఆర్‌ఐలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

ఒడిశా రాష్ట్రం కటక్‌లోని ఐసీఏఆర్‌- నేషనల్ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఆర్ఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్-l  అర్హత: ఫోటోగ్రఫీ/సినిమాటోగ్రఫీ/ఫిల్మ్‌ ఎడిటింగ్‌/ వీడియో ఎడిటింగ్‌ లేదా తత్సమాన విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.30,000. వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ: 15-01-2026. వేదిక: ఐసీఏఆర్-నేషనల్ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కటక్‌. పని ప్రదేశం: ఐసీఏఆర్-నేషనల్ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కటక్‌. Website:https://icar-crri.in/

Government Jobs

శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌

ములుగు (వీ & ఎం), సిద్దిపేట జిల్లాలోని శ్రీ కొండ లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీజీహెచ్‌యూ) అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్: 79 పోస్టులు విభాగాలు: అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, అగ్రోనమీ, బయోకెమిస్ట్రీ, క్రాప్ ఫిజియాలజీ, ఎంటమాలజీ, ఫ్లోరికల్చర్, ఫ్రూట్ సైన్స్, జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్, మైక్రోబయాలజీ, ప్లాంట్ పాథాలజీ, పీఎస్‌ఎంఏ, సాయిల్ సైన్స్ & అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, వెజిటబుల్ సైన్స్. అర్హతలు: అభ్యర్థులు హార్టికల్చర్ / అగ్రికల్చర్ / అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. నెట్‌ అర్హత తప్పనిసరి. పీహెచ్‌డీ ఉన్న వారికి నెట్‌ మినాహాయింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.57,700- రూ.1,82,400. ఎంపిక విధానం: సెల్ఫ్ అసెస్‌మెంట్ స్కోర్ కార్డ్ ఆధారంగా షార్ట్‌లిస్ట్, బోధానానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసి, అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి డిమాండ్ డ్రాఫ్ట్ (DD) జతచేసి, రిజిస్ట్రార్ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపించాలి. దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.3,000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.2,000. దరఖాస్తు చివరి తేదీ: 31.01.2026. పరీక్ష/ఇంటర్వ్యూ కేంద్రం: శ్రీ కొండ లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ, ములుగు (వీ & ఎం), సిద్దిపేట జిల్లా. Website: https://skltghu.ac.in/

Government Jobs

ఎన్టీపీసీ లిమిటెడ్‌లో అసిస్టెంట్ లా ఆఫీసర్‌ పోస్టులు

ఎన్టీపీసీ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) అసిస్టెంట్ లా ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: అసిస్టెంట్‌ లా ఆఫీసర్‌: 06 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 2026 జనవరి 16వ తేదీ నాటికి 30 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.30,000 - రూ.1,20,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 16.   Website:https://careers.ntpc.co.in/recruitment/

Government Jobs

ఐఐటీ గువాహటిలో ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ ప్రొఫెసర్ , ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 26 వివరాలు: 1. అసోసియేట్ ప్రొఫెసర్  - 13 2. ప్రొఫెసర్  - 13 విభాగాలు: బయోసైన్సెస్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, డిజైన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమిస్ట్రీ, హ్యూమానిటీస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తదితరాలు అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31.01.2026.. Website:https://iitg.ac.in/iitg_page_details?page=61/fac_rec