కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో మెరైన్ ఇంజినీర్ ఉద్యోగాలు
కొచ్చిన్ పోర్ట్ అథారిటీ, కేరళ మెరైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు: 1. మెరైన్ ఇంజినీర్: 05 2. సూపరింటెండింగ్ ఇంజినీర్: 01 3. డిప్యూటీ డైరెక్టర్: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 35 - 40 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు మెరైన్ ఇంజినీర్‌కు రూ.70,000 - రూ.2,00,000, సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు రూ.60,000 - రూ.1,80,000, డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.50,000 - రూ.1,60,000. ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 23. Website:https://www.cochinport.gov.in/careers