Posts

Current Affairs

సైయెంట్, ఏఐసీటీఈతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లోని యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ అభివృద్ధికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సైయెంట్‌లతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం కీలక ఒప్పందం కుదర్చుకుంది. 2025, జూన్‌ 11న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో సైయెంట్‌ ఫౌండేషన్, ఏఐసీటీఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ  మేరకు ప్రధానంగా నగర ఆధారిత ఇన్నోవేషన్‌ క్లస్టర్లను ప్రారంభించేందుకు సైయెంట్‌ ఫౌండేషన్, ఏఐసీటీఈ సహకారం అందిస్తాయి. మొదట విశాఖ నుంచి ప్రారంభిస్తారు. విద్యా సంస్థల్లో వ్యాపార దృక్పథం, మేధో సంపత్తి (ఐపీ) సృష్టితోపాటు స్టార్టప్‌ సంస్కృతిని ప్రోత్సహిస్తారు. దీంతో విద్యా సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం పెంపొందుతుంది.

Current Affairs

International Day of Play

♦ The International Day of Play is celebrated every year on June 11 to protect, promote, and prioritise play - not just for fun, but as an essential part of a child’s growth and development. ♦ The first International Day of Play was celebrated on June 11, 2024, signifying a global commitment to acknowledge and celebrate the value of play in children’s development. ♦ According to the United Nations Children’s Fund (UNICEF), the United Nations General Assembly set this date in March 2024 following a resolution that was co-proposed by several countries, including Vietnam. ♦ Since then, the International Day of Play has been observed officially. ♦ 2025 theme: “Choose Play – Every Day."

Current Affairs

planetary system orbiting a youthful star YSES-1

♦ Astronomers have discovered a planetary system orbiting a youthful star YSES-1 located 300 light-years away, using the James Webb Space Telescope (JWST).   ♦ The system's two planets, YSES-1 b and YSES-1 c, are packed with coarse, rough, and frankly irritating silica material. ♦ Astronomers say this discovery around a star that is just 16.7 million years old could hint at how the planets and moons of our 4.6 billion-year-old solar system took shape. ♦ As both planets are gas giants, they could offer astronomers an opportunity to study the real-time evolution of planets like Jupiter and Saturn. ♦ One of these extrasolar planets, or "exoplanets," YSES-1 c, has a mass around 14 times the mass of Jupiter. On YSES-1 c, this silica matter is located in clouds in its atmosphere, which gives it a reddish hue and creates sandy rains that fall inward towards its core.

Current Affairs

Mumbai has secured the 6th spot among 97 global cities

♦ According to a report by Cushman & Wakefield, Mumbai has secured the 6th spot among 97 global cities in terms of under-construction data centre capacity, overtaking major hubs like London and Dublin. ♦ The report also highlights Pune and Bengaluru, which rank 4th and 5th respectively among Asia-Pacific’s emerging data centre hubs. ♦ Apart from its global ranking, Mumbai ranks as the 7th established data center market in the Asia Pacific region. ♦ At the end of 2024 the city had 335 MW of data center capacity under construction, which, once completed, will expand its operational capacity by 62%.  ♦ The report covers 97 global markets, highlights power access, land availability, and infrastructure as key factors shaping data center development.   ♦ Virginia is in first position with 1,834 MW data centre capacity under construction, followed by Atlanta (1,078 MW), Columbus (546 MW), Dallas (500 MW) and Phoenix (478 MW).

Current Affairs

India’s social security coverage

♦ According to the International Labour Organization’s (ILO) ILOSTAT latest data, India’s social security coverage has increased from 19% in 2015 to 64.3% in 2025, an unprecedented 45 percentage point surge over the past decade. ♦ Recognising these efforts, the ILO acknowledged India’s achievement and officially published on its dashboard that over 94 crore people are now covered under at least one social protection benefit. ♦ In terms of beneficiary count, India now ranks second in the world, providing social protection to around 94 crore citizens.

Walkins

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 18 వివరాలు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌/రేడియో మెకానిక్‌ 1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్: 06 2. ప్రాజెక్ట్‌ డిప్లొమా అసిస్టెంట్: 05 3. ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అసిస్టెంట్(ఫిట్టర్‌): 05 4. ప్రాజెక్ట్ ట్రేడ్‌ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్ మెకానిక్/రేడియో మెకానిక్‌): 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థులకు 28 - 33 ఏళ్లు ఉండాలి. వేతనం: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు నెలకు రూ.30,000 - రూ.39,000, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్‌కు రూ.25,000 - రూ.29,000, ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అసిస్టెంట్‌కు రూ.23,000 - రూ.27,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 జూన్‌ 15. వేదిక: భారత్ డైనమిక్స్ లిమిటెడ్, జీ-బ్లాక్, ఏపీఐఐసీ-ఐఏఎల్‌ఏ, ఫఖెరటాకియా గ్రామం, వీఎస్‌ఈజెడ్‌ పోస్ట్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 530049. Website:https://bdl-india.in/recruitments

Government Jobs

టీహెచ్‌డీసీలో ఫీల్డ్‌ ఇంజినీర్‌ పోస్టులు

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (టీహెచ్‌డీసీ) వివిధ విభాగాల్లో ఫీల్డ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: విభాగాలు: జియో టెక్నికల్ ఇంజినీరింగ్‌, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌, హైడ్రాలజీ, సిస్మాలజీ. ఫీల్డ్‌ ఇంజినీర్‌: 07 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బీఎస్సీ(ఇంజినీరింగ్‌), బీఈ, బీటెక్‌(సివిల్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు. జీతం: నెలకు రూ.53,580. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 10. Website:https://thdc.co.in/en/career/new-job-opening

Government Jobs

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో పోస్టులు

భారత ప్రభుత్వ పబ్లిక్‌ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐసీఎల్‌) 2025-26 సంవత్సరానికి గాను జనరలిస్ట్, స్పెషలిస్ట్ స్కేలు-I పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 266 వివరాలు: 1. జనరలిస్ట్: 170 2. డాక్టర్లు (ఎంబీబీఎస్‌): 14  3. లీగల్: 20 4. ఫైనాన్స్: 21  5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 20 6. ఆటోమొబైల్ ఇంజినీర్లు: 21 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకామ్‌, బీటెక్‌/బీఈ, ఎంబీబీఎస్‌, పీజీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంకామ్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్‌/ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 01.05.2025 తేదీ నాటికి 21 - 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.50,925 - రూ.90,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, డీడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250. ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్, 100 మార్కులు), మెయిన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ 250 + డెస్క్రిప్టివ్ 30 మార్కులు), ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 3 జూలై 2025. Website:https://nationalinsurance.nic.co.in/recruitment

Government Jobs

భారత తీరరక్షక దళంలో నావిక్, యాంత్రిక్ పోస్టులు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-01/ 2026 అండ్‌ 02/ 2026 బ్యాచ్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్‌ బ్రాంచ్‌), యాంత్రిక్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 630  వివరాలు: సీజీఈపీటీ- 01/26 బ్యాచ్‌: 1. నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు 2. యాంత్రిక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 60 పోస్టులు సీజీఈపీటీ- 02/26 బ్యాచ్‌: 1. నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు 2. నావిక్‌ (డొమెస్టిక్‌ బ్రాంచ్‌): 50 అర్హత: నావిక్ పోస్టులకు 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్‌), నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌ పోస్టులకు పదో తరగతి, యాంత్రిక్ పోస్టులకు 10వ లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.(01-08-2004 నుంచి 01-08-2008 మధ్య జన్మించి ఉండాలి). ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు  వర్తిస్తుంది. బేసిక్‌ పే: నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700. యాంత్రిక్ పోస్టులకు రూ.29,200. ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.  పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది). దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-06-2025. పరీక్ష తేదీలు:  స్టేజ్-I: సెప్టెంబర్ 2025; స్టేజ్-II: నవంబర్ 2025/ ఫిబ్రవరి 2026; స్టేజ్-III: ఫ్రిబ్రవరి 2026, జులై 2026. Website:https://joinindiancoastguard.cdac.in/cgept/ Apply online:https://cgept.cdac.in/icgreg/candidate/login

Apprenticeship

ఐపీఆర్‌సీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఇండియన్‌ పోర్ట్‌ రైల్ & రోప్‌వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐపీఆర్‌సీఎల్‌) డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 30 వివరాలు: 1. డిప్లొమా అప్రెంటిస్‌: 15 2. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 15 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 15 జూన్‌ 2025 తేదీ నాటికి అభ్యర్థులకు 23 ఏళ్లు ఉండాలి. స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.10,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 15. Website: https://iprcl.in/Site/vacancies