Posts

Government Jobs

Various Posts In AIASL, Kolkata

AI Airport Services Limited invites applications for the recruitment of Handyman, Utility Agent cum Ramp Driver posts on Contract basis at Netaji Subhash Chandra Bose International Airport, Kolkata No. of posts: 142. Details: 1. Utility Agent cum Ramp Driver: 30 Posts 2. Handyman (Male): 112 Posts Qualification: 10th Class, Valid HMV Driving License for Utility Agent Cum Ramp Driver Posts. 10th Class, Must be able to read and understand English Language for Handyman posts. Upper Age Limit: 28 years. Salary: Per Month Utility Agent cum Ramp Driver posts Rs.24,960. For Handyman posts Rs.22,530. Last date for online application: 31-10-2024. Website:https://www.aiasl.in/

Admissions

Free Coaching for Competative Exams In TG ST Study Circle, Hyderabad

Telangana Study Circle for STs- PETC Warangal, invites applications from the eligible ST candidates for admission into Foundation Course for Groups, Police, Banking, Railways, SSC etc.  Detials: Foundation Course for Groups, Police, Banking, Railways, SSC etc. Eligibility:  Only candidates belongs to Scheduled Tribes can apply.  Any degree from recognized University.  The candidates and his/ her parents combined annual income below 2.0 Lakhs are only eligible to apply.  Only erstwhile Warangal district (Mulugu, JS Bhupalapally, Mahabubabad, Warangal, Hanumakonda & Jangaon) candidates are eligible to apply.  Selection Process: Based on merit marks secured in the screening test conducted by the PETC, Warangal. Last date for online registration: 27.10.2024. Hall Ticket Generation/Download: 31.10.2024. Conducting of Screening Test: 03.11.2024. Announcement of Selected Candidates: 07.11.2024. Contact Numbers: 8374417424 & 9441003400 Website:https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=stde Apply online:https://studycircle.cgg.gov.in/TSTWPETCWarGroupsRegistration2425.do

Admissions

AP SW & TW Depts - Mega DSC Free Coaching 2024-25

The Govt. of AP - SW & TW Departments will conduct free Residential Coaching for DSC exam for SC & ST students, giving to secure more teaching positions in Govt. schools. Eligible to interested SC, ST students can apply for the free coaching online through Jnanabhumi web portal. Details: SW & TW Depts Mega DSC Free Coaching 2024-25 Qualification: Inter, Degree, B.Ed., D.Ed., TET Score. No. of Students taken: SC- 3050, ST- 2000 (Total 5050) Mode of coaching: Residential. Mode of selection of students: Through screening Test and TET score (85% : 15%) Duration of the coaching: 3 months. Coaching applicable for: SGT & SA. Selection Process: Through a screening test. Selected candidates will be allotted to the empanelled coaching centre as per the priority of the students. Application last date: 25-10-2024. Website:https://jnanabhumi.ap.gov.in/#undefined1

Walkins

టీఐఎఫ్‌ఆర్‌, ముంబయిలో క్లర్క్ ట్రైనీ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ముంబయి- క్లర్క్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 15. వివరాలు: 1. క్లర్క్ ట్రైనీ(అకౌంట్స్‌): 10 పోస్టులు 2. క్లర్క్ ట్రైనీ(అడ్మినిస్ట్రేషన్‌): 05 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ పరిజ్ఞానం, పర్సనల్ కంప్యూటర్‌/ అప్లికేషన్‌ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి. వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.  నెలవారీ స్టైపెండ్: రూ.22000. రిక్రూట్‌మెంట్ విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్. వాక్-ఇన్-సెలక్షన్ తేదీ: 18-11-2024. వేదిక: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, 1 హోమీ భాభా రోడ్, నేవీ నగర్, కొలాబా, ముంబయి. Website:https://tifrrecruitment.tifrh.res.in/applicants/notice.php

Government Jobs

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ పోస్టులు

కోల్‌కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఎన్‌ఐసీఎల్‌ కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన క్లాస్-III కేడర్‌లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 500 (ఎస్సీ- 43; ఎస్టీ- 33; ఓబీసీ- 113; ఈడబ్ల్యూఎస్‌- 41; యూఆర్‌- 270) వివరాలు: ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణ రాష్ట్రంలో 12 ఖాళీలు ఉన్నాయి. అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం. వయస్సు: 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. పే స్కేల్: నెలకు రూ.22,405- రూ.62,265. ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు: ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు). ప్రశ్నల సంఖ్య: 100. మొత్తం మార్కులు 100. పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు. మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు: టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు) ప్రశ్నల సంఖ్య: 200. మొత్తం మార్కులు 200. పరీక్ష వ్యవధి: 120 నిమిషాలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్. తెలుగు రాష్ట్రాల్లో మెయిన్‌ ఎగ్జామినేషన్ కేంద్రాలు: హైదరాబాద్. దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 24 అక్టోబర్ 2024. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 11, 2024. దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 24 అక్టోబర్ 2024 నుంచి 11 నవంబర్ 2024 వరకు. ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 30 నవంబర్ 2024. ఫేజ్-II ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 28 డిసెంబర్ 2024. Website:https://nationalinsurance.nic.co.in/recruitment

Government Jobs

ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ ఖాళీలు

దిల్లీలోని ది ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్ (ఐఎల్ఐ) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివ‌రాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ (లా): 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, పీహచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు రూ.57,700-రూ.1,82,400. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 25-10-2024. Website:http://www.ili.ac.in/

Government Jobs

భోపాల్ ఐసర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌) డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 31 వివ‌రాలు: 1. డిప్యూటీ రిజిస్ట్రార్: 01 2. డిప్యూటీ లైబ్రేరియన్: 01 3. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01 4. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01 5. స్పోర్ట్స్ ఆఫీసర్: 01 6. మెడికల్ ఆఫీసర్: 01 7. సీనియర్ సూపరింటెండెంట్: 01 8. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్: 01 9. కౌన్సిలింగ్ సూపరింటెండెంట్: 01 10. జూనియర్ ఇంజినీర్: 01 11. జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్: 01 12. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 13. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్: 01 14. జూనియర్ అసిస్టెంట్: 07 15. ల్యాబ్ అసిస్టెంట్: 06 16. అటెండెంట్: 5 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్/ ఎండీ/ డీఎన్‌బీ,  పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్‌, మెటీరియల్స్, కంప్యూటర్ అప్లీకేషన్స్‌, లా, హెచ్‌ఆర్, సైకియాట్రీ, మెడిసిన్, కార్డియాలజీ తదితరాలు. వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్ ద్వారా. ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌సెల్, రూమ్ నెంబర్: 105(ఏ), ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్,  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (IISER), భోపాల్ బైపాస్‌ రోడ్, భౌరి, భోపాల్’ చిరునామాకు పంపించాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11-11-2024. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-11-2024. Website:https://www.iiserb.ac.in/

Government Jobs

ఎయిర్‌ ఇండియా, కోల్‌కతాలో వివిధ‌ పోస్టులు

ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒప్పంద ప్రాతిపదికన హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 142. వివరాలు: 1. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 30 పోస్టులు 2. హ్యాండీమ్యాన్ (మేల్‌): 112 పోస్టులు అర్హత: యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి, హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్; హ్యాండీమ్యాన్ పోస్టుల 10వ తరగతితో పాటు ఇంగ్లిష్ భాష చదవడం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 28 సంవత్సరాలు. జీతం: నెలకు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులలకు రూ.24,960. హ్యాండీమ్యాన్ పోస్టులకు రూ.22,530. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-10-2024. Website:https://www.aiasl.in/

Admissions

తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉద్యోగ పరీక్షలకు ఉచిత శిక్షణ

తెలంగాణ‌ రాష్ట్రం గిరిజన సంక్షేమ శాఖ పరిధి వరంగల్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ గ్రూప్‌-1, 2, 3, 4, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, పోలీసు ఇతర ఉద్యోగ పరీక్షల కోసం ఉచిత ఫౌండేషన్‌ కోర్సు అందించనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల  ఎంపిక ఉంటుంది. ఉచిత స్టడీ మెటీరియల్‌ సమకూరుస్తారు. వివరాలు: టీజీపీఎస్సీ గ్రూప్‌-1, 2, 3, 4, బ్యాంకింగ్, పోలీసు, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర ఉద్యోగ పరీక్షలకు ఉచిత ఫౌండేషన్‌ కోర్సు  అర్హతలు: గిరిజన తెగలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థి తల్లిదండ్రులు వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించకూడదు. ఉమ్మడి వరంగల్ జిల్లా (ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం)కు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సీట్ల కేటాయింపు: మహిళలకు 33 1/3 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లను కేటాయించారు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 27.10.2024. హాల్ టికెట్ జనరేషన్/ డౌన్‌లోడ్ తేదీ: 31.10.2024. స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 03.11.2024. ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 07.11.2024. పూర్తి వివరాలకు: 8374417424 & 9441003400 Website:https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=stde Apply online:https://studycircle.cgg.gov.in/TSTWPETCWarGroupsRegistration2425.do

Admissions

ఏపీలో మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్

ఏపీలో మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 ఉచిత శిక్షణకు గాను సాంఘిక సంక్షేమ/ గిరిజన సంక్షేమ శాఖలు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నాయి. డీఎస్సీ ఉచిత శిక్షణ‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధ‌న‌, ఉచిత భోజనం, వ‌స‌తి సౌకర్యాలను ప్రభుత్వ కల్పించనుంది.  వివరాలు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ 2024-25 సీట్లు: మొత్తం 5,050 మంది అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీలకు 3,050; ఎస్టీలకు 2,000 సీట్లు కేటాయించారు. ఎంపికైన వారికి ఉచితంగా బోధ‌న‌, భోజనం, వ‌స‌తి సౌకర్యాలు అందుతాయి.  అర్హత: ఎస్‌జీటీ కోచింగ్‌కు ఇంటర్, డీఈడీ, టెట్; స్కూల్ అసిస్టెంట్ కోచింగ్‌కు డిగ్రీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, టెట్ స్కోరుకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. ప్రభుత్వం చేసే ఖ‌ర్చు: ఎస్జీటీ అభ్యర్థులకు శిక్షణ కోసం ఫీజు రూ.10 వేలు, స్టడీ మెటీరియల్‌కు రూ.3 వేలు, డైట్‌ బిల్లు నెలకు రూ.4,500 చొప్పున మూడు నెలలకు రూ.13,500 కలిపి మొత్తం ఒక అభ్యర్థిపై రూ.26,500 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది.  స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు శిక్షణ కోసం ఫీజు రూ.12 వేలు, స్టడీ మెటీరియల్‌కు రూ.3 వేలు, డైట్‌ బిల్లు మూడు నెలలకు రూ.13,500 కలిపి మొత్తం రూ.28,500 ప్రభుత్వం వ్యయం చేయనుంది. దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2024. Website:https://jnanabhumi.ap.gov.in/#undefined1