Posts

Current Affairs

Antariksha Abhyas-2024

♦ Defence Space Agency inaugurated a first-ever space exercise Antariksha Abhyas-2024 in New Delhi on 11 November 2024. ♦ It is a first of its kind exercise being conducted and is expected to help secure national strategic objectives in space and integrate India’s space capability in military operations. ♦ The Space Exercise aims to provide enhanced understanding of space based assets and services and to gain understanding of operational dependency on space segment between stakeholders.  ♦ The three-day exercise will be concluded on 13 November 2024. 

Current Affairs

Sanjiv Khanna

♦ Justice Sanjiv Khanna was sworn in as the 51st Chief Justice of India on 11 November 2024. He was administered oath by President Droupadi Murmu at the Rashtrapati Bhavan. Justice Khanna will serve a six-month tenure as Chief Justice of India and is expected to retire on May 13, 2025. ♦ Justice Sanjiv Khanna was part of several landmark Supreme Court judgments, including the scrapping of the electoral bonds scheme and upholding the abrogation of Article 370. ♦ His notable judgments also include upholding the use of electronic voting machines in elections. ♦ He was born on 14 May 1960. His father, Justice Dev Raj Khanna, was a former Delhi High Court judge, and his uncle, Justice HR Khanna, was a prominent former apex court judge. ♦ Justice Khanna enrolled as an advocate with the Bar Council of Delhi in 1983. He was elevated to the Supreme Court on January 18, 2019.

Current Affairs

భారత్, రష్యా ఒప్పందం

పాన్‌స్టిర్‌ గగనతల రక్షణ క్షిపణి-తుపాకీ వ్యవస్థ కొనుగోలు కోసం భారత్, రష్యా మధ్య 2024, నవంబరు 11న ఒప్పందం కుదిరింది. దీనిపై బీడీఎల్‌ సీఎండీ ఎం.మాధవరావు, రష్యాకు చెందిన రోసోబోరాన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రతినిధి కోవలెంకో జర్మన్‌లు సంతకాలు చేశారు. గోవాలో జరిగిన భారత్‌-రష్యా అంతర్‌ ప్రభుత్వ కమిషన్‌ సమావేశం ఇందుకు వేదికైంది.  పాన్‌స్టిర్‌ గగనతల రక్షణ వ్యవస్థ చాలా సమర్థ ఆయుధం. గగనతలం ముప్పుల నుంచి కీలక సైనిక, పారిశ్రామిక ఆస్తులను రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 

Current Affairs

దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధవిన్యాసాలు

అంతరిక్షంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునే ఉద్దేశంతో భారత్‌ తొలిసారిగా ‘అంతరిక్ష అభ్యాస్‌’ పేరిట విన్యాసాలు నిర్వహిస్తోంది. 2024, నవంబరు 11న దిల్లీలో ఈ కార్యక్రమం ప్రారంభమైనట్లు త్రిదళాధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ తెలిపారు. రోదసిలోని మన సాధన సంపత్తికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నవంబరు 13 వరకూ ఇవి జరుగుతాయి. రక్షణ అంతరిక్ష సంస్థ (డీఎస్‌ఏ) వీటిని నిర్వహిస్తుంది. 

Current Affairs

అమెరికా జాతీయ సరిహద్దు విభాగ అధిపతిగా టామ్‌ హోమన్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ 2024, నవంబరు 11న టామ్‌ హోమన్‌ను ‘బోర్డర్‌ జార్‌’గా నియమించారు. ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైన అక్రమ వలసల నిరోధాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు ఈ నియామకాన్ని చేపట్టారు.    అమెరికా జాతీయ సరిహద్దుల పరిరక్షణ విభాగ అత్యున్నతాధికారిని ‘బోర్డర్‌ జార్‌’గా అభివర్ణిస్తుంటారు. టామ్‌ హోమన్‌ గతంలో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యూఎస్‌ ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తాత్కాలిక డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. బోర్డర్‌ జార్‌ నియామకానికి సెనెట్‌ అనుమతి పొందాల్సిన అవసరం లేదు.

Current Affairs

జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ కొత్త సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. మాజీ సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీ విరమణతో ఈ కొలీజియంను పునరుద్ధరించాల్సి వచ్చింది. ప్రస్తుత సీజేఐ సంజీవ్‌ ఖన్నాతో పాటు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ సభ్యులుగా ఉండే కొలీజియం సుప్రీంకోర్టుకు నూతన న్యాయమూర్తులను ఎంపిక చేస్తుంది. 

Current Affairs

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2024, నవంబరు 11న ప్రమాణం చేయించారు. 2025 మే 13 వరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ ఆరేళ్ల కాలంలో 117 తీర్పులు రాశారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలకమైన తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, అధికరణం 370 రద్దును సమర్థిస్తూ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు.

Current Affairs

ఏపీ బడ్జెట్‌ రూ.2,94,427 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2024, నవంబరు 11న రూ.2,94,427.25 కోట్ల అంచనా వ్యయంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించారు. ఇది ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్‌.                            రంగాలవారీ కేటాయింపులు వ్యవసాయానికి.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి రూ.43,402.33 కోట్లు కేటాయించారు. ఇందులో ఉచిత విద్యుత్‌కు రూ.7,241 కోట్లు ఖర్చు చేయనున్నారు. అన్నదాతా సుఖీభవ పథకానికి రూ.1,000 కోట్లు, పంటల బీమాకు రూ.1023 కోట్లు కేటాయించారు.  ‘స్వర్ణాంధ్ర 2047’ కార్యక్రమం ద్వారా 11 ఉద్యాన పంటలను క్లస్టర్‌ విధానంలో ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2024-25లో 1.74 లక్షల ఎకరాలను వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల కిందకు తీసుకురావలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పంటకోత అనంతర నష్టాల నివారణకు సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.337.41 కోట్లతో కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌ రూమ్‌లు మంజూరు చేశారు. వ్యవసాయ బడ్జెట్‌లో డిజిటల్‌ సేద్యానికి రూ.44.77 కోట్లు ప్రతిపాదించారు. ప్రతి రైతుకు చెందిన వ్యక్తిగత, కుటుంబ, బ్యాంకింగ్, వ్యవసాయ సమాచారాన్ని సేకరించి, ప్రభుత్వ పథకాలతో అనుసంధానించనున్నారు.  జలవనరులశాఖకు.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2024-25 బడ్జెట్‌లో మొత్తం 16,705.33 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే నిధులతో కలిపి ప్రాజెక్టుల నిర్మాణానికి, జలవనరులశాఖలో ఇతర ఖర్చులకు ఈ నిధులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,445 కోట్లు కేటాయించారు. మైనారిటీల సంక్షేమం.. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఏడాదికిగాను రూ.4,376 కోట్లు కేటాయించింది. మైనారిటీ యువత జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనారిటీ ఆర్థిక సహకార సంస్థకు రూ.173 కోట్లు ప్రతిపాదించింది. ఉర్దూ ఘర్‌ కమ్‌ షాదీఖానాల నిర్మాణం చేపట్టనుంది. ప్రధానమంత్రి జన్‌ వికాస్‌ కార్యక్రమానికి రూ.208 కోట్లు ప్రతిపాదించారు. ఇతర కేటాయింపులు: ♦ ఇమామ్, మౌజమ్‌ల గౌరవ వేతనాలకు రూ.90 కోట్లు. ♦ పాస్టర్ల గౌరవ వేతనాలకు రూ.29.49 కోట్లు. ♦ క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకు రూ.2.42 కోట్లు. ♦ మైనారిటీ ఆర్థిక సంస్థకు రూ.173 కోట్లు. ♦ ఉర్దూ అకాడమీకి రూ.3.66 కోట్లు. దళితుల సంక్షేమానికి.. 2024-25 బడ్జెట్‌లో ఎస్సీల సంక్షేమానికి రూ.18,497 కోట్లు కేటాయించింది. ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు కార్పొరేట్‌ పాఠశాలల్లో విద్యనభ్యసించేలా 2014-19 మధ్య అమలు చేసిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని పునరుద్ధరించింది. దళిత యువత గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న కార్పొరేషన్‌ రుణాల మంజూరుకు రూ.341 కోట్లు కేటాయించింది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించేందుకు రూ.30 కోట్లు కేటాయించింది. చర్మకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు లిడ్‌క్యాప్‌ సంస్థకు రూ.4 కోట్లు ప్రతిపాదించింది. వైకాపా ప్రభుత్వం నిలిపేసిన బుక్‌ బ్యాంకు పథకానికి రూ.1.62 కోట్లు కేటాయించింది. ఇతర కేటాయింపులు: ♦ ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకానికి రూ. 51.50 కోట్లు. ♦ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ఏర్పాటుకు రూ.50.12 కోట్లు. ♦ ఎస్సీ స్టడీ సర్కిళ్లకు రూ.2.25 కోట్లు. ♦ ఉచిత విద్యుత్తు అమలుకు రూ.300 కోట్లు. ♦ బోధనా రుసుములకు రూ.200 కోట్లు. ♦ ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలకు రూ.42 కోట్లు. ♦ గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.42 కోట్లు. ♦ కేంద్ర పథకాల అనుసంధానంతో గ్రామాలు, వసతిగృహాల్లో మౌలిక వసతులకు రూ.379 కోట్లు. గిరిజన సంక్షేమం.. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో రూ. 7,557 కోట్లు కేటాయించింది. ఐటీడీఏలను గాడిన పెట్టేందుకు రూ. 23.77 కోట్లు ప్రతిపాదించారు. ఇతర కేటాయింపులు: ♦ ట్రైకార్‌కు రూ.110 కోట్లు, * మౌలిక వసతులకు రూ.125 కోట్లు, *ఉచిత విద్యుత్‌కు రూ.100 కోట్లు, *బోధనా రుసుములకు రూ.128 కోట్లు, *ఉపకార వేతనాలకు రూ. 41 కోట్లు, * గిరిజన పరిశోధనా కేంద్రానికి రూ. 28 కోట్లు, * అంబేడ్కర్‌ విదేశీ విద్యకు రూ. 10 కోట్లు, * విద్యా సంస్థల్లో వసతులకు రూ. 42 కోట్లు. బీసీ సంక్షేమం.. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2024-25 బడ్జెట్‌లో రూ.39,007 కోట్లు కేటాయించారు. బీసీల సంక్షేమానికి 15 శాఖలు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నాయి.  బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా వారికి ఆర్థిక స్వావలంబన కలిగించేలా రూ.896.79 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఉపయోగించి బీసీల్లోని 139 కులాలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు మంజూరు చేయనుంది. బీసీ యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు. ♦ బీసీ-ఏ కార్పొరేషన్‌కు రూ. 276.24 కోట్లు. ♦ బీసీ-బీ కార్పొరేషన్‌కు రూ. 243.01 కోట్లు. ♦ బీసీ-డీ కార్పొరేషన్‌కు రూ. 284.82 కోట్లు. ♦ బీసీ-ఈ కార్పొరేషన్‌కు రూ. 92.72 కోట్లు కేటాయించారు.  పౌరసరఫరాల శాఖకు.. పేదలకు బియ్యం, ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు, రాయితీపై ఇతర నిత్యావసరాల పంపిణీకి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.3,690 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో బియ్యం పంపిణీకి రూ.2,344.66 కోట్లు, వంటగ్యాస్‌ రాయితీకి రూ.825 కోట్లు, గడప వద్దకే రేషన్‌ సరఫరాకు రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది.   విమాన రంగానికి.. రాష్ట్రంలో కుప్పం, దగదర్తి, మూలపేటల్లో కొత్తగా విమానాశ్రయాల అభివృద్ధితో పాటు అనంతపురం- తాడిపత్రి మధ్య ఎయిర్‌ స్ట్రిప్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో కదలిక తెచ్చేందుకు రూ. 792.72 కోట్లు కేటాయించింది. పౌర విమానయాన రంగంలోని ప్రాజెక్టులకు పెట్టుబడి కింద రూ. 203.30 కోట్లు ఖర్చు చేయడంతో పాటు మరో రూ.300 కోట్లు రుణంగా తీసుకోవాలని భావిస్తోంది. ఈ రంగంపై 2022-23లో జగన్‌ ప్రభుత్వం రూ. 578.09 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో రూ. 667.86 కోట్లు ప్రతిపాదించి, రూ. 470.09 కోట్లు (70 శాతం) మాత్రమే వెచ్చించింది. ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలకు.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఓడరేవుల అభివృద్ధికి రూ.451.17 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఓడరేవుల అభివృద్ధికి భూసేకరణ, ఇతర అవసరాలకు రూ. 438.28 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం 2022-23లో రూ.13.52 కోట్లే ఖర్చు చేసింది. 2023-24 బడ్జెట్‌లో రూ. 472.36 కోట్లు కేటాయించినా, వినియోగించింది రూ.12.89 కోట్లు మాత్రమే.  గురుకులాలు, వసతిగృహాల్లో మౌలిక వసతులకు ♦ వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువుతున్న గురుకులాలు, వసతిగృహాలకు 2024-25 బడ్జెట్‌లో కింది విధంగా కేటాయింపులు చేశారు. ♦ బీసీ గురుకులాలకు ఆర్థిక చేయూత కోసం రూ. 361.64 కోట్లు.  ♦ గురుకులాల భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు. ♦ వసతిగృహాల్లో మౌలిక వసతులకు రూ.25 కోట్లు, కళాశాల వసతి గృహాలకు మరో రూ. 117.75 కోట్లు. ♦ బీసీ భవన్, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి రూ. 10.12 కోట్లు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టి పురోగతిలో ఉన్న 3 బీసీ భవన్‌లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాన్ని ఈ నిధులతో పూర్తి చేయనున్నారు. ♦ బీసీ స్టడీ సర్కిళ్ల పునరుద్ధరణకు రూ. 8 కోట్లు.  ♦ విదేశీ విద్యాదరణ పథకానికి రూ. 36.11 కోట్లు.  పారిశ్రామిక రంగం.. 2024-25 బడ్జెట్‌లో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, చేనేత, గనుల శాఖకు కలిపి రూ.4,371.42 కోట్లు కేటాయించారు. ఇందులో చెరకు, గిడ్డంగులు, చేనేత, జౌళి, గనుల శాఖలకు రూ.461.92 కోట్లు, ఆయా శాఖల్లోని ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులకు రూ.394.82 కోట్లు వెచ్చించనుంది. ఈ మొత్తం పోనూ, రూ.3,514.68 కోట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదించింది.    గత ప్రభుత్వం బకాయి పెట్టిన ప్రోత్సాహకాలను చెల్లించేందుకు వీలుగా చిన్న, భారీ పరిశ్రమలకు రూ.2,270.79 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రెవెన్యూ, క్యాపిటల్‌ వ్యయాల కింద రూ.1,428.96 కోట్లు, రూ.841.82 కోట్లు వెచ్చించనుంది. చిన్న, భారీ పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిలు చెల్లించే రూ.1,385.26 కోట్లను రెవెన్యూ వ్యయం కింద పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.  విద్యారంగం.. ♦ 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి కేటాయింపులు కింది విధంగా ఉన్నాయి. ♦ టీచింగ్‌ గ్రాంట్స్‌కు రూ.18,397.48 కోట్లు ♦ సమగ్ర శిక్షకు రూ.3,507.31 కోట్లు ♦ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.1,854.03 కోట్లు ♦ మన బడి మన భవిష్యత్తుకు రూ.1,000 కోట్లు ఆరోగ్య రంగం.. 2024-25 రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కూటమి ప్రభుత్వం రూ.18,421 కోట్లు కేటాయించింది. 2023-24లో గత వైకాపా ప్రభుత్వం రూ.15,882 కోట్లు కేటాయించింది.  వైద్య కళాశాలలకు, ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు అవసరాలకు వైకాపా ప్రభుత్వం రూ.2,732.38 కోట్లను కేటాయిస్తే కూటమి ప్రభుత్వం రూ.4 వేల కోట్లను ప్రతిపాదించింది. అంటే అదనంగా మరో 1,349 కోట్లు కేటాయించారు. ఆసుపత్రులో మందుల కొనుగోళ్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.600 కోట్లను ప్రతిపాదించారు.. కిందటేడు ఈ మొత్తం రూ.391.08 కోట్లు మాత్రమే. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ బడ్జెట్‌లో రూ.2,431 కోట్లను ప్రతిపాదించారు.  డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో పనిచేసే బోధనాసుపత్రుల్లో అవసరాలకు రూ.9,177.55 కోట్లను కేటాయించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో (గత ఏడాది) ఈ కేటాయింపు రూ.7,220.99 కోట్లు మాత్రమే. బోధనాసుపత్రుల్లో అడ్వాన్స్‌డ్‌ రేడియాలజీ సర్వీసెస్‌ కోసం రూ.80.00 కోట్లను కేటాయించారు. శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోలు సేవలకు రూ.240.96 కోట్లు ఇచ్చారు. గత బడ్జెట్‌లో ఈ మొత్తం రూ.218.49 (9.79%)కోట్లుగా ఉంది.   ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అవసరాలకు గత బడ్జెట్‌లో రూ.4,676 కోట్లను ప్రతిపాదిస్తే..ఈ ప్రభుత్వం రూ.4,828 కోట్లను కేటాయించింది. 15వ ఆర్థిక కమిషన్‌ గ్రాంట్స్‌ కింద రూ.876 కోట్లను కేటాయిస్తున్నట్లు ఈ ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఇది రూ.525 కోట్లుగా ఉంది. మానవ వనరుల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో రూ.1,117 కోట్లు ఇచ్చారు.  కొత్త, పూర్వ వైద్య కళాశాలల నిర్మాణ అవసరాలకు రూ.859.02 కోట్లను ఈ బడ్జెట్‌లో  కేటాయించారు. ఇందులో రూ.45 కోట్లు నంద్యాల, ఏలూరు, రాజమహేంద్రవరం కళాశాలల్లో పరికరాల కోసం ఖర్చుపెడతారు. వైకాపా ప్రభుత్వ కంటే కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో వైద్య కళాశాలలకు అదనంగా రూ.220 కోట్లు కేటాయించింది.  ఆడబిడ్డ నిధి పథకానికి.. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థికసాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రకటించాయి. ‘మహిళలకు ఆర్థిక సహకారం’ పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి 2024-25 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,341.82 కోట్లు కేటాయించింది. బీసీ మహిళలకు రూ.1099.78 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.629.37 కోట్లు, మైనారిటీలకు రూ.83.79 కోట్లు, ఎస్సీ మహిళలకు రూ.1198.42 కోట్లు, గిరిజన మహిళలకు రూ.330.10 కోట్లు ప్రతిపాదించింది. జెండర్‌ బడ్జెట్‌లో ఈ నిధుల్ని ప్రత్యేకంగా చూపించింది. ♦ ముఖ్యాంశాలు.. ♦ 2024-25 బడ్జెట్‌లో రహదారుల పునర్నిర్మాణానికి రూ.5,441 కోట్లు కేటాయించారు. గ్రామాల్లో పంచాయతీరాజ్‌ రోడ్ల నిర్మాణానికి రూ.1,936 కోట్ల నిధులిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.16,739 కోట్లు కేటాయించారు.  ♦ 2024-25 వార్షిక బడ్జెట్‌లో జలజీవన్‌ మిషన్‌ పథకానికి రూ.1,420.12 కోట్లు కేటాయించారు.  ♦ చంద్రన్న బీమాకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.280.82 కోట్లు కేటాయించింది.  ♦ పేదల ఇళ్లలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున సాయం చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనికోసం ‘తల్లికి వందనం’ పథకానికి రూ.6,487 కోట్లు కేటాయించింది. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలకు, వారికి సంబంధించిన మౌలిక సౌకర్యాల కల్పనకు కలిపి రూ.69,437 కోట్లు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రూ.10 లక్షల వరకు అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు రూ.1,250 కోట్లు ఇచ్చింది.  ♦ పేదల గృహ నిర్మాణం కోసం రూ.4,012 కోట్లు నిధులు చూపింది. పట్టణాల్లో జీ ప్లస్‌ 3 తరహాలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లకు రూ.1,089 కోట్లు కేటాయించారు. ♦ ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌’ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి 2024-25లో రూ.4,012 కోట్లు కేటాయించింది.  ♦ అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు 2024-25 వార్షిక బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారు. ♦ వైఎస్సార్‌ జిల్లా కడప ఉక్కు కర్మాగారం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయించింది. ♦ ఇంధన రంగానికి ప్రభుత్వం రూ.8,207.65 కోట్లు కేటాయించింది. ♦ అమరావతి రాజధాని నిర్మాణానికి, భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు కలిపి రూ.3,445 కోట్లు కేటాయించారు.  

Current Affairs

కాప్‌ 29వ సదస్సు

పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో అత్యంత కీలకమైన ‘కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌)’ 29వ సదస్సు అజర్‌బైజాన్‌ రాజధాని బాకు వేదికగా 2024, నవంబరు 11న ప్రారంభమైంది. వాతావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ నేతలు ఇందులో చర్చిస్తారు. ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. మన దేశం తరఫున 19 మంది సభ్యుల బృందం పాల్గొంటుంది. సదస్సులో భారత్‌ నవంబరు 18-19 తేదీల్లో తన అధికారిక ప్రకటన చేస్తుంది.  కాప్‌-29 సదస్సు నవంబరు 22 వరకు కొనసాగుతుంది. 

Current Affairs

ఈపీఎఫ్‌ఓలో సభ్యుల సంఖ్య 7.37 కోట్లు

గత ఆర్థిక సంవత్సరం (2023-24) ముగిసేసరికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో నమోదైన కంపెనీల సంఖ్య 6.6% పెరిగి 7.66 లక్షలకు చేరింది. ఇదే సమయంలో సభ్యుల సంఖ్య 7.6% వృద్ధితో 7.37 కోట్లుగా ఉన్నట్లు కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌ఓ వార్షిక నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.