యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
తెలంగాణ, హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) డైరెక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 42 వివరాలు: 1. ప్రొఫెసర్: 20 2. అసోసియేట్ ప్రొఫెసర్: 21 3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 01 విభాగాలు: సైన్స్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో జనరల్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణత ఉండాలి. వయో పరిమితి: 65 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, సెమినార్, గ్రూప్ డిస్కషన్, డెమోన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా/ఆఫ్‌లైన్ ద్వారా ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్: 221, మొదటి అంతస్తు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్, సి.ఆర్. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-12-2024. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-12-2024. Website:https://uohyd.ac.in/ Apply online:https://curec.samarth.ac.in/index.php/search/site/index