Posts

Current Affairs

Arvinder Singh Sahney

♦ Arvinder Singh Sahney was appointed Chairman and Managing Director (CMD) of state-run Indian Oil Corporation Ltd (IOCL) for a five-year term on 13 November 2024. ♦ He succeeded V. Satish Kumar. Currently, Arvinder Singh is the executive director of IOC (Business Development - Petrochemicals).  ♦ Arvinder joined IOC in 1993 following a brief stint at Tata Chemicals. He was appointed executive director of the company in February 2022.

Current Affairs

ఐఓసీ ఛైర్మన్‌గా అర్విందర్‌ సింగ్‌ సాహ్నీ

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) కొత్త ఛైర్మన్‌గా అర్విందర్‌ సింగ్‌ సాహ్నీ 2024, నవంబరు 13న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (బిజినెస్‌ డెవలప్‌మెంట్‌- పెట్రోకెమికల్స్‌)గా ఉన్నారు. ఆయన అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

Current Affairs

‘గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్ట్‌’ నివేదిక

శిలాజ ఇంధనాల వాడకం వల్ల వెలువడే ఉద్గారాలు 2024లో రికార్డు స్థాయికి చేరనున్నాయని ‘గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్ట్‌’ నివేదిక వెల్లడించింది. భారత్‌ నుంచి 4.6%, చైనాలో నామమాత్రంగా 0.2% చొప్పున పెరుగుదల ఉంటుందని నివేదిక అంచనా వేసింది. బాకులో జరుగుతున్న కాప్‌29 సదస్సులో 2024, నవంబరు 13న ఈ నివేదికను విడుదల చేశారు.  అమెరికా, ఈయూల నుంచి ఉద్గారాలు తగ్గనున్నాయని, మిగిలిన దేశాల నుంచి మాత్రం 1.1% పెరగవచ్చని నివేదిక తెలిపింది.

Current Affairs

భారత్‌కు ముఖ్యమైన బ్యాంకులివే

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లను దేశీయ వ్యవస్థాత్మక ముఖ్య బ్యాంకులు (డి-ఎస్‌ఐబీలు)గా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఏడాదీ (2024) గుర్తించింది. వీటి జాబితాను 2024, నవంబరు 13న విడుదల చేసింది. బకెట్‌ వర్గీకరణ ప్రకారం, క్యాపిటల్‌ కన్జర్వేషన్‌ బఫర్‌తో పాటు అధిక కామన్‌ ఈక్విటీ టైర్‌ 1 (సీఈటీ 1) నిర్వహిస్తున్న రుణదాతలను డి-ఎస్‌ఐబీలుగా గుర్తించింది. 

Current Affairs

శంషాబాద్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారాలు

సౌదీ అరేబియాలోని రియాద్‌లో 2024, నవంబరు 12న జరిగిన సౌదీ ఎయిర్‌పోర్ట్‌ ఎగ్జిబిషన్‌-2024లో ఎయిర్‌పోర్ట్‌ ఎక్సెలెన్స్‌ పురస్కారాలను ప్రకటించారు. వాటిలో ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో డిజిటల్‌ ట్విన్‌ విజేతగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నిలిచింది. ఎయిర్‌పోర్ట్‌ రెవెన్యూ మేనేజ్‌మెంట్‌ విభాగంలో స్మార్ట్‌ ట్రాలీ రన్నరప్‌ స్థానం కూడా దక్కింది. ఒకేసారి మూడు అంతర్జాతీయ పురస్కారాలు శంషాబాద్‌ విమానాశ్రయానికి దక్కాయి.

Current Affairs

మస్క్, వివేక్‌లకు ట్రంప్‌ కీలక బాధ్యతలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌.. టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్, భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామిలకు కీలక బాధ్యతలు అప్పగించారు. వీరిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) సంయుక్త సారథులుగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్‌’ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.  

Current Affairs

జస్టిస్‌ సూర్యకాంత్‌

సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ (ఎస్‌సీఎల్‌ఎస్‌సీ) ఛైర్మన్‌గా జస్టిస్‌ సూర్యకాంత్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా నామినేట్‌ చేశారు. ఈ మేరకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా) 2024, నవంబరు 13న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఇది వరకు ఈ స్థానంలో పనిచేసిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌.. అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు ఉద్దేశించిన నల్సాకు ఇటీవల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

Current Affairs

బుకర్‌ ప్రైజ్‌ విజేతగా హార్వే

అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్‌ రచయిత్రి సమంతా హార్వే రాసిన ‘ఆర్బిటల్‌’ నవల 2024 ఏడాదికిగాను ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేతగా ఎంపికైంది. 2024, నవంబరు 13న లండన్‌లోని ఓల్డ్‌ బిల్లింగ్స్‌గేట్‌ వద్ద జరిగిన వేడుకలో విజేతను న్యాయనిర్ణేతలు ప్రకటించారు. ఈ బహుమతి కింద రచయితకు 50 వేల పౌండ్లు (రూ.53.65 లక్షలు) అందజేస్తారు. బ్రిటన్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన కేవలం 136 పేజీల నవలిక ఇది. 

Current Affairs

సంతానం ఎక్కువ ఉన్నా ఎన్నిక పోటీల్లో అర్హులే

ఇద్దరి కంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఎత్తివేస్తూ ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లులను ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 2024, నవంబరు 13న ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీకి అనర్హులని చట్టం చేశారు.  కాలక్రమంలో సంతానోత్పత్తి రేటు తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగింది.  ఈ నేపథ్యంలో సంతానోత్పత్తిపై నియంత్రణను ఎత్తి వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరి కంటే ఎక్కువ సంతానంగల వారు అనర్హులన్న పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లులను శాసనసభ ఆమోదించింది.

Walkins

Project Technical Support Posts In ICMR, NIV

ICMR- National Institute of Virology, Kerala which is a public sector organization is conducting interviews for filling the following vacancies on temporary basis. Details:  Project Technical Support-I: 03 Qualification: Tenth, Diploma/ Degree along with working experience.  Salary: Rs.18,000 per month. Age Limit: 28 years. Selection Process: Based on Written Test/Skill Test, Interview etc. Date of Interview: 29-11-2024. Venue: ICMR-National Institute of Virology, Makki Junction, Kuravanthodu, Alappuzha, Kerala Website:https://niv.icmr.org.in/