Posts

Current Affairs

Susie Wiles

♦ US President-elect Donald Trump on Thursday appointed Susie Wiles as White House Chief of Staff on 8 November 2024. ♦ She will be the first woman in US history to hold this position. Susie was the campaign manager for Trump’s highly successful 2024 Campaign for President.  ♦ The Chief of Staff serves as the gatekeeper for the President, the liaison to Congress and government departments, and plays a key role in steering policy decisions.

Current Affairs

Anil Chauhan

♦ Chief of Defence Staff General Anil Chauhan inaugurated the 2nd edition of the annual Indian Military Heritage Festival (IMHF) in New Delhi on 8 November 2024. ♦ The two-day festival being held on November 08-09, 2024. It aims to engage global and Indian think tanks, corporations, public and private sector undertakings, non-profits, academicians, and research scholars focusing on India’s national security, foreign policy, military history and military heritage. ♦ CDS also launched Project ‘Shaurya Gatha’, an initiative of the Department of Military Affairs and the USI of India, which aims to conserve and promote India’s military heritage through education and tourism.

Current Affairs

World’s first Carbon dioxide-to-methanol conversion plant

♦ India’s largest power producer, NTPC unveiled its hydrogen-fuel buses, which are set to operate in Ladakh, on the occasion of the 50th foundation day. ♦ NTPC CMD Gurdeep Singh virtually launched the hydrogen-fuel buses. ♦ NTPC also inaugurated the world’s first Carbon dioxide-to-methanol conversion plant at its Vindhyachal plant on 8 November 2024. NTPC has been working on Gen-4 ethanol, green urea, and Sustainable Aviation Fuel.  ♦ The company said it had developed and tested ‘first indigenous catalyst’ for Methanol Synthesis and that it had made ‘substantial’ progress with hydrogen, carbon capture, and other innovative technologies.

Current Affairs

సీఎస్‌ఈ నివేదిక

అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్‌లో 2024 మొదటి 9 నెలల్లోనే 3,238 మంది బలయ్యారని మేధోమథన సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరానిమెంట్‌ (సీఎస్‌ఈ) నివేదిక పేర్కొంది. మొత్తం 274 రోజులకు గాను 255 రోజుల్లో (93 శాతం) దేశం ఇలాంటి వాతావరణ పోకడలను ఎదుర్కొందని వివరించింది. ప్రాణనష్టానికి తోడు ఈ వైపరీత్యాల వల్ల 32 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, 2,35,862 ఇళ్లు దెబ్బతిన్నాయని, 9,457 పశువులు బలయ్యాయని పేర్కొంది. 2023లో మొదటి 9 నెలల్లో 2,923 మంది చనిపోయారు. 18.4 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతినగా, 80,293 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 92,519 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి అని నిదేదిక వెల్లడించింది.

Current Affairs

భారత్‌-ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలు

భారత్, ఆస్ట్రేలియా సైనికదళాల ఉమ్మడి సైనిక విన్యాసాలు 2024, నవంబరు 8న పుణెలో ప్రారంభమయ్యాయి. పట్టణ, అటవీ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఆపరేషన్ల నిర్వహణలో ఇరు పక్షాల మధ్య సహకారం, సమన్వయం పెంపొందించుకోవడం దీని ఉద్దేశం. ‘ఆస్ట్రాహింద్‌’ పేరుతో ఈ విన్యాసాలను నిర్వహించడం ఇది మూడోసారి.  ఈ విన్యాసాల్లో భారత సైన్యంలోని డోగ్రా రెజిమెంట్‌కు చెందిన 140 మంది, వాయుసేనకు చెందిన 14 మంది పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియా తరఫున 120 మంది సైనిక సిబ్బంది భాగస్వామ్యమయ్యారు.

Current Affairs

బొడ్డుపల్లి మారుతీ ప్రసన్న

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాపట్లకు చెందిన ప్రముఖ మొక్కజొన్న శాస్త్రవేత్త బొడ్డుపల్లి మారుతీ ప్రసన్న 2024, నవంబరు 8న జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక టాస్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. పురస్కారం కింద ఆయనకు రూ.లక్ష నగదు అందజేయనున్నారు. దిల్లీకి చెందిన ట్రస్టు ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ (టాస్‌) ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలకు ఏటా ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ప్రభు చేతుల మీదగా దిల్లీలో డిసెంబరు 20న మారుతీ ప్రసన్న పురస్కారం అందుకోనున్నారు. 

Current Affairs

నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (ఎన్‌ఎల్‌ఎస్‌ఏ- నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ 2024, నవంబరు 8న నియమితులయ్యారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీస్‌ యాక్ట్‌ 1987లోని సెక్షన్‌ 3(2)(బి)కింద దఖలు పడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ను పదవిలో నియమించారు. నవంబరు 11 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. 

Current Affairs

భారత హాకీ జట్టుకు ప్రత్యేక పురస్కారం

పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ పురుషుల జట్టుకు ప్రత్యేక పురస్కారం లభించింది. 2024, నవంబరు 8న మస్కట్‌లో జరిగిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) కాంగ్రెస్‌లో ఈ అవార్డుతో భారత జట్టును గౌరవించారు. ఎఫ్‌ఐహెచ్‌ అధ్యక్షుడు తయ్యబ్‌ ఇక్రమ్, ఫ్రెంచ్‌ హాకీ సమాఖ్య చీఫ్‌ ఇసబెల్లె చేతుల మీదుగా హాకీ ఇండియా కార్యదర్శి భోళనాథ్‌ సింగ్‌ ఈ పురస్కారాన్ని స్వీకరించాడు.

Current Affairs

వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా సూసీవైల్స్‌

వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా సూసీవైల్స్‌ (67) 2024, నవంబరు 8న నియమితులయ్యారు. అమెరికా చరిత్రలోనే ఈ పదవిని చేపట్టిన తొలిమహిళగా ఆమె రికార్డు సృష్టించారు. సూసీవైల్స్‌ ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌కు ప్రచార నిర్వాహకురాలుగా వ్యవహరించి, ఆయన విజయంలో కీలకపాత్ర పోషించారు.  సూసీ 14 మే 1957లో న్యూజెర్సీలో పుట్టారు. ట్రంప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సూసీని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కాలమ్‌ ‘అమెరికా రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన మహిళ’గా అభివర్ణించింది.

Walkins

Various Posts In Power Mech

Power Mech Projects Limited (Power Mech), Head Office, Hyderabad is conducting an interview for filling up the vacant posts of Engineers and Managerial in Thermal Power Plants at various locations. Details: 1. Shift Incharges 2. Field operators 3. Engineers 4. Maintenance Engineers 5. General Managers 6. WTP Chem 7. BTG 8. BOP 9. CHP Operations 10. Senior Engineers Departments: Operations and Maintenance, Commissioning Incharges and Managers. Qualification: Degree in relevant discipline, BE/BTech, ME/MTech PG pass along with work experience should follow the post. Work Locations: Andhra Pradesh (Nellore-Meenakshi), Telangana, Rajasthan, Punjab, Uttar Pradesh, Madhya Pradesh, Chhattisgarh. Selection Process: Based on Interview. Application Procedure: Online/ Through Email. Email:cvpowermech.net or hrnelloreamc@powermech.net Date of Interview: 10-11-2024. Venue: Hotel Kalpana Residency, Dhanalakshmipuram, Muthukuru Road, Nellore. Website:https://powermechprojects.com/careers/