Posts

Current Affairs

ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌

భారతదేశ ఆర్థిక వృద్ధి మూడు ఆర్థిక సంవత్సరాల (2024-25, 2025-26, 2026-27) వరకు 6.5-7 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయాలు, ప్రైవేటు వినియోగం పెరుగుతుండటం వృద్ధికి ఊతమిస్తాయని పేర్కొంది. మంచి ఆర్థిక వృద్ధి బ్యాంకుల ఆస్తుల నాణ్యతకు మద్దతుగా నిలుస్తుందని వెల్లడించింది. ఆరోగ్యకర కార్పొరేట్‌ బ్యాలెన్స్‌ షీట్లు, మెరుగైన నష్ట నిర్వహణ చర్యలు ఆస్తుల నాణ్యతను మరింత స్థిరపరిచే అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆర్థిక వృద్ధి 7.2 శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా వేసింది. 2023-24లో 8.2 శాతం వృద్ధి నమోదైంది.

Current Affairs

చంద్రశేఖర్‌ ఆజాద్‌కు బాలసాహిత్య పురస్కారం ప్రదానం

కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి ప్రకటించిన బాలసాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పమిడిముక్కల చంద్రశేఖర్‌ ఆజాద్‌ అందుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో 2024, నవంబరు 14న నిర్వహించిన కార్యక్రమంలో అకాడమీఛైర్మన్‌ మాధవ్‌కౌశిక్‌ ఆయనకు ఈ అవార్డుతోపాటు రూ.50వేల నగదు బహుమతి, తామ్రపత్రం అందించి.. శాలువాతో సత్కరించారు.  చిన్నారుల జీవితాలపై ఆయన రాసిన మాయాలోకం నవలకు అకాడమీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. చంద్రశేఖర్‌ ఆజాద్‌ స్వస్థలం గుంటూరు జిల్లా. ఇప్పటివరకు 30 నవలలు, వందకు పైగా లఘుకథలు రాశారు. గతంలో నంది అవార్డు, కళారత్నహంస పురస్కారాలు పొందారు. 

Current Affairs

అమెరికా నిఘా విభాగాధిపతిగా తులసీ గబ్బార్డ్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశ నిఘా విభాగాధిపతిగా భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్‌ను 2024, నవంబరు 14న నామినేట్‌ చేశారు. ఆమెను నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా ప్రతిపాదించారు. ఈ నామినేషన్‌ ఖరారైతే.. జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ), సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)తో పాటు దాదాపు 18 యూఎస్‌ నిఘా సంస్థలు ఆమె పర్యవేక్షణలో ఉంటాయి.  తులసీ గబ్బార్డ్‌ గతంలో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున నెగ్గి కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువుగా ఘనత సాధించారు. 2013 నుంచి 2021 వరకు కాంగ్రెస్‌లో సభ్యురాలిగా ఉన్నారు. అమెరికా సైన్యంలోనూ పనిచేశారు. 2022లో డెమోక్రటిక్‌ పార్టీని వీడారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌నకు మద్దతు పలికారు. ట్రంప్‌ 2025, జనవరి 20న అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. 

Current Affairs

మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కామన్వెల్త్‌ ఆఫ్‌ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు ‘డొమినికా అవార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’తో సత్కరించనుంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం 2024, నవంబరు 14న తెలిపింది. కొవిడ్‌ సమయంలో డొమినికాకు భారత్‌ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. నవంబరు మూడోవారంలో గయానాలో జరిగే ది కరేబియన్‌ కమ్యూనిటీ అండ్‌ కామన్‌ మార్కెట్‌ సదస్సులో ఆ అవార్డును ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.  

Current Affairs

పినాక ఆయుధ పరీక్ష విజయవంతం

రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పినాక గైడెడ్‌ ఆయుధ వ్యవస్థల్ని 2024, నవంబరు 14న విజయవంతంగా పరీక్షించింది. సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి ముందు మరోసారి పరీక్షను నిర్వహించారు. అవి చేరగలిగే దూరం, కచ్చితత్వం వంటి వేర్వేరు అంశాలను దీని ద్వారా మదించారు. భిన్న ప్రదేశాల నుంచి మూడు దశల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణశాఖ తెలిపింది. రెండు లాంఛర్ల నుంచి 12 చొప్పున రాకెట్లను దీనికోసం వాడినట్లు వెల్లడించింది.

Current Affairs

ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు

కనుమూరు రఘురామకృష్ణరాజు 2024, నవంబరు 14న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు.  

Walkins

Senior Resident Posts In AIIMS, Rajkot

All India Institute of Medical Sciences (AIIMS), Rajkot (Gujarat) is conducting interviews for the posts of Senior Resident. No. of Posts: 41 Details: Departments: Anaesthesia, Anatomy, Biochemistry, Dermatology, ENT, General Medicine, General Surgery, Pathology, Paediatrics, Gynecology etc. Qualification: MBBS/MD/MS/MCH/DM in relevant discipline along with work experience. Upper Age Limit: 45 years. There is a relaxation of five years for SC/ST, three years for OBC and ten years for PWD candidates. Application Fee: Rs.1000, SC/ST/ for Rs.800, fee exempted for PwBDs  candidates. Application Procedure: Through Online. Selection Process: Interview.  Application Last Date: 27-11-2024. Date of Interview: 28-11-2024 Venue: Conference Hall, Ground Floor, AYUSH Building, AIIMS Rajkot. Website:https://aiimsrajkot.edu.in/

Internship

Digital Strategist Trainee Posts In Small Big Growth

Small Big Growth invites applications for Digital Strategist Trainee Vacancies. Details: Post: Digital Strategist Trainee  Company: Small Big Growth Skills: Content, Search Engine, Social Media Marketing, Effective Communication, Search and Analytics, Search Engine Optimization, UI and UX Design.  Stipend: Rs.5,000 per month. Duration: 6 months Application Procedure: Through Online. Application Last Date: 07-12-2024 Website:https://internshala.com/internship/details/work-from-home-digital-strategist-trainee-internship-at-small-big-growth1730978309

Government Jobs

REO Posts In IIT Kanpur

Indian Institute of Technology (IITK) Kanpur invites applications for filling up the vacant posts on contract basis. Number of Posts: 16 Details: 1. Senior Research Establishment Officer: 06 2. Research Establishment Officer (Grade-1): 08 3. Research Establishment Officer (Grade-2): 02 Qualification: BE/BTech (Electrical/Electronics/Mechanical/Metallurgy/Aeronautical), ME/MTech, PhD (Civil/Environmental/Chemical) along with work experience in relevant discipline following the post. Salary: Per month Rs.78,800-Rs.2,09,200 for REO posts; Rs.67,700-Rs.2,08,700 for REO (Grade-1) posts; Rs.56,100-Rs.1,77,500 for REO (Grade-2) posts. Upper Age Limit: 48 years for REO posts; 45 years for REO (Grade-1) posts; 40 years for REO (Grade-II) posts.  Application Fee: Rs.1000. SC/ ST/ PwBDs/ Female candidates are exempted in fee. Online Application Last Date: 08-12-2024 Website:https://www.iitk.ac.in/

Government Jobs

MTS, Technical Assistant Posts In IFGTB, Coimbatore

ICFRE- Institute of Forest Genetics & Tree Breeding, Coimbatore invites applications for the following regular posts. No. of posts: 16. Details: 1. Multi Tasking Staff (MTS): 08 Posts 2. Lower Division Clerk (LDC): 01 Post 3. Technician (TE) (Field/Lab): 03 Posts 4. Technical Assistant (TA) (Field/Lab): 04 Posts Qualification: 10th Pass, 12th Class, 10+2 in Science, Bachelor Degree in Science in the relevant field/Specialization from a recognized University. Age Limit (as on 30.11.2024): 18-27 years for MTS/ LDC, 18-30 years for TE, 21-30 years for TA Posts. Selection Process: Based on written examination/ Skill Test, certificate verification, medical exam. Closing date of online applications: 30.11.2024. Website:https://ifgtb.icfre.gov.in/vacancy Apply online:https://ecampus.cc/IFGTB/Candidate/index.php