Posts

Walkins

ఐఐపీఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రిసెర్చ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 04 వివరాలు: ఫీల్డ్‌ అసిస్టెంట్‌- 01 యంగ్ ప్రొఫెషనల్‌-II- 01 యంగ్ ప్రొఫెషనల్‌-I- 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అగ్రికల్చర్‌ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు రూ.20,000; యంగ్ ప్రొఫెషనల్‌-IIకు రూ.42,000; యంగ్ ప్రొఫెషనల్‌-Iకు రూ.30,000. వయోపరిమితి: ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 21- 35 ఏళ్లు; 21- 45 ఏళ్లు ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు: 02, 03, 07, 22.01.2025. వేదిక: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రిసెర్చ్‌, కాన్‌పూర్‌, ఉత్తరప్రదేశ్. Website:https://iipr.icar.gov.in/

Walkins

ఎయిమ్స్‌ కళ్యాణిలో సీనియర్‌ రెసిడెంట్స్‌ పోస్టులు

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, నడియా జిల్లా, కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏయిమ్స్‌) వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌ అకాడమిక్‌) పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపరికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 45 వివరాలు: విభాగాలు: బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్‌ సర్జరీ, రేడియాలజీ, పల్మోనరీ మెడిసిన్, సర్జికల్‌ ఆంకాలజీ తదితరాలు. అర్హత: ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ, ఎంఎస్సీ/ ఎం.బయోటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. జీతం: నెలకు రూ.15,600- రూ.39,100. వయోపరిమితి: 45 ఏళ్లు మించరాదు. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ వారికి 10ఏళ్ల సడలింపు ఉంటుంది). ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ఎస్టీ, ఇతర కమ్యూనిటీల వారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు: 21.01.2025 - 22.01.2025. వేదిక: అడ్మినిస్టేటివ్‌ బిల్డింగ్‌, ఒకటో అంతస్తు, ఎయిమ్స్‌ కమిటీ రూం, కళ్యాణి. Website:https://aiimskalyani.edu.in/

Government Jobs

యూకో బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

కోల్‌కతాలోని యూకో బ్యాంకు- రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 68. వివరాలు: 1. ఎకనామిస్ట్ (జేఎంజీఎస్‌-I): 2 పోస్టులు 2. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ (జేఎంజీఎస్‌-I): 2 పోస్టులు 3. సెక్యూరిటీ ఆఫీసర్ (జేఎంజీఎస్‌-I): 8 పోస్టులు 4. రిస్క్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-II): 10 పోస్టులు 5. ఐటీ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-II): 21 పోస్టులు 6. చార్టర్డ్ అకౌంటెంట్ (ఎంఎంజీఎస్‌-II): 25 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి సీఏ/ ఎఫ్‌ఆర్‌ఎం/ సీఎఫ్‌ఏ, ఐసీఏఐ సర్టిఫికేషన్‌, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 01-11-2024 నాటికి ఎకనామిస్ట్ పోస్టులకు 21 – 30; ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు 22 – 35; మిగిలిన పోస్టులకు పోస్టులకు 25 – 35 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్: నెలకు జేఎంజీఎస్‌-I పోస్టులకు రూ.48,170 - రూ.85,920. ఎంఎంజీఎస్‌-II పోస్టులకు రూ.64820 - రూ.93960. ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ స్క్రీనింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20-01-2025. Website:https://ucobank.com/job-opportunities Apply online:https://onlineappl.ucoonline.in/Recurit_Agen/home.jsp

Government Jobs

రైల్వేలో గ్రూప్-డి పోస్టులు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 లెవల్‌-1 గ్రూప్‌-డి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 32,000 వివరాలు: ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్. పోస్టులు: పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మొదలైనవి. విభాగాలు: ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలైనవి. అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.  ప్రారంభ వేతన: నెలకు రూ.18,000. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.01.2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025. గమనిక: పోస్టుల వారీ ఖాళీలు, విద్యార్హత, ఎంపిక విధానం, సిలబస్‌ తదితర వివరాలను ఆర్‌ఆర్‌బీ త్వరలో విడుదల చేయనుంది. Website:https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281 Apply online:https://www.rrbapply.gov.in/#/auth/landing

Government Jobs

జేఎన్‌ఏఆర్‌డీడీసీలో ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

మహారాష్ట్ర, నాగ్‌పుర్‌లోని జవహార్‌లాల్‌ నెహ్రూ అల్యూమినియం రిసెర్చ్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ సెంటర్‌ ( జేఎన్‌ఏఆర్‌డీడీసీ) రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: సెక్షన్‌ ఆఫీసర్‌- 01 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-II - 02 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-I - 01 ల్యాబ్‌ అసిస్టెంట్‌- 01 అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఐటీఐ, సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు సెక్షన్‌ ఆఫీసర్‌కు రూ.44,900- రూ.1,42,400; సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-IIకు రూ.29,200- రూ.92,300; సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-Iకు రూ.25,500- రూ.58,500; ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.19,900-రూ.63,200. వయోపరిమితి: సెక్షన్‌ ఆఫీసర్‌కు 35 ఏళ్లు, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-IIకు 30 ఏళ్లు; సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-Iకు 25 ఏళ్లు; ల్యాబ్‌ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.500.(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17-1-2025 Website:https://jnarddc.gov.in/

Government Jobs

బీఐఎస్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు

  న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: విభాగాలు: సీఈడీ, ఎఫ్‌ఏడీ, ఈఈడీ, ఎంఈడీ, ఎస్‌సీఎండీ. అర్హత: సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ, మెకానికల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌/ బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.70,000. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హత, ఉద్యోగానుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.01.2025. Website:https://www.bis.gov.in/

Government Jobs

బీఐఎస్‌లో మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 06 వివరాలు: విభాగాలు: ఎస్‌ఎండీ/ ఐఆర్ అండ్‌ టీఐఎస్‌డీ, టీఎన్‌ఎండీ, ఎన్‌ఐటీఎస్‌. అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్‌), ఇంజినీరింగ్‌, ఎంఏ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.1.5 లక్షలు. వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హత, ఉద్యోగానుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.1000. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.01.2025. Website:https://www.bis.gov.in/

Government Jobs

ఏపీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏపీ డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 1,289 సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఖాళీల భర్తీకి నియామక ప్రకటనను జారీ చేసింది.  మొత్తం పోస్టుల సంఖ్య: 1,289. వివరాలు: 1. సీనియర్ రెసిడెంట్ (క్లినికల్): 603 పోస్టులు 2. సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్): 590 పోస్టులు 3. సీనియర్ రెసిడెంట్ (సూపర్ స్పెషాలిటీ): 96 పోస్టులు స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్‌, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్‌/ రేడియాలజీ,ఎమెర్జెన్సీ మెడిసిన్‌, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ/ సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ.  అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 44 ఏళ్లు మించకూడదు. జీత భత్యాలు: నెలకు బ్రాడ్ స్పెషాలిటీలకు రూ.80,500, సూపర్ స్పెషాలిటీకి రూ.97,750. పదవీకాలం: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.2000, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-01-2025. Website:https://dme.ap.nic.in/ Apply online:https://dmeaponline.com/

Apprenticeship

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)- దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్‌ వర్క్‌షాప్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 4232 (ఎస్సీ- 635, ఎస్టీ- 317, ఓబీసీ- 1143, ఈడబ్ల్యూఎస్‌- 423, యూఆర్‌- 1714) వివరాలు: 1. ఏసీ మెకానిక్- 143 2. ఎయిర్ కండిషనింగ్- 32 3. కార్పెంటర్- 42 4. డీజిల్ మెకానిక్- 142 5. ఎలక్ట్రానిక్ మెకానిక్- 85 6. ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్- 10 7. ఎలక్ట్రీషియన్- 1053 8. ఎలక్ట్రికల్ (ఎస్‌&టి) (ఎలక్ట్రీషియన్)- 10 9. పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్)- 34 10. ట్రైన్‌ లైటింగ్ (ఎలక్ట్రీషియన్)- 34 11. ఫిట్టర్- 1742 12. మోటార్ మెకానిక్ వెహికల్ (ఎంఎంవీ)- 08 13. మెషినిస్ట్- 100 14. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటీఎం)- 10 15. పెయింటర్‌- 74 16. వెల్డర్- 713 ఎస్‌సీఆర్‌ యూనిట్ ప్రదేశాలు: సికింద్రాబాద్, లల్లాగూడ, మెట్టుగూడ, ఖాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్‌గిర్‌, నాందెడ్‌, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్‌. అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.  వయోపరిమితి: 28.12.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఐటీఐలో సాధించి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27-01-2025. Website:https://scr.indianrailways.gov.in/ Apply online:https://onlineregister.org.in/instructions.php

Apprenticeship

అణుశక్తి కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు

అనుమల (గుజరాత్)లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌), కక్రాపర్ గుజరాత్ సైట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 284. వివరాలు: 1. ట్రేడ్ అప్రెంటిస్: 176 ఖాళీలు ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, సీఓపీఏ / పీఏఎస్‌ఏఏ, మెషినిస్ట్, టర్నర్, ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్. 2. డిప్లొమా అప్రెంటిస్: 32 ఖాళీలు విభాగాలు: కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్. 3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 76 ఖాళీలు విభాగాలు: కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, బీఎస్సీ (ఫిజిక్స్), బీఎస్సీ (కెమిస్ట్రీ), హ్యూమన్ రిసోర్సెస్, కాంట్రాక్ట్స్ అండ్‌ మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 21-01-2025 నాటికి ట్రేడ్ అప్రెంటిస్‌కు 18-24; డిప్లొమా అప్రెంటిస్‌కు 18-2; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 18-26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ కోర్సులో పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. శిక్షణ కాలం: ఏడాది. స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.7,700 - రూ.8,050. డిప్లొమా అప్రెంటిస్ రూ.8,000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రూ.9,000. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-01-2025. Website:https://npcilcareers.co.in/MainSiten/default.aspx Apply online:https://www.apprenticeshipindia.gov.in/