Posts

Current Affairs

All India Council for Technical Education (AICTE)

♦ The All India Council for Technical Education (AICTE) in collaboration with the National Quantum Mission (NQM) under the Department of Science and Technology (DST) has launched an Undergraduate (UG) minor programme in ‘Quantum Technologies’. ♦ It aiming to prepare India’s workforce for the quantum revolution and positioning the nation as a global leader in cutting-edge quantum innovation. ♦ AICTE and Indian Institutes of Technology (IITs) will conduct Faculty Development Programmes (FDPs) to support teachers in delivering high-quality quantum education. ♦ The newly launched programme is designed to bridge the gap between academia and industry by addressing the strategic and multidisciplinary needs of the quantum ecosystem. ♦ The undergraduate curriculum covers the four major pillars of quantum technology: Quantum computing, Quantum communications, Quantum sensing and metrology, Quantum materials and devices.

Current Affairs

Sachin Tendulkar

♦ Indian cricket icon Sachin Tendulkar was awarded honorary membership of the prestigious Melbourne Cricket Club (MCC). ♦ Founded in 1838, the MCC is one of the oldest sports clubs in Australia and is responsible for the management and development of the Melbourne Cricket Ground (MCG). ♦ Tendulkar has an impressive record at the MCG, with 449 runs from five Tests at an average of 44.90, including a century and three fifties.  ♦ Earlier in 2012, Tendulkar was awarded the Order of Australia, one of the country's highest honours.

Current Affairs

Dr Sandip Shah

♦ Dr Sandip Shah was appointed as the Chairperson of the National Accreditation Board for Testing and Calibration Laboratories (NABL) on 28 December 2024. ♦ He is joint MD of Neuberg Diagnostics. NABL  is the body providing accreditation to pathological and testing laboratories in India.  ♦ Sandip Shah served as the chair of the Medical Labs Accreditation Improvement Committee (MLAIC) and was involved in a mentorship role at NABL before becoming the Chairperson.

Current Affairs

బుల్లెట్‌ రైలు

ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కొత్త బుల్లెట్‌ రైలును చైనా 2024, డిసెంబరు 29న ఆవిష్కరించింది. ఈ రైలు ప్రయోగ పరీక్షల్లో గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. దీన్ని సీఆర్‌450గా వ్యవహరిస్తున్నారు.  ఇది ప్రస్తుతం గంటకు 350 కి.మీ.వేగంతో పరుగులు తీసే సీఆర్‌400 మోడల్‌ కంటే అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. దీంతో నాలుగు గంటలు పట్టే బీజింగ్‌ -షాంఘై ప్రయాణాన్ని కొత్త రైలులో కేవలం 2.5 గంటల్లోనే పూర్తిచేసుకోవచ్చు.

Current Affairs

బుమ్రా

వేగంగా 200 వికెట్లు సాధించిన భారత బౌలర్లలో బుమ్రా (44 మ్యాచ్‌లు).. జడేజాతో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో  నిలిచాడు. అశ్విన్‌ (33 టెస్టులు) ముందున్నాడు. టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లలో 20 కన్నా తక్కువ సగటు ఉన్నది బుమ్రా (19.56)కు మాత్రమే. 200 వికెట్లు సాధించే క్రమంలో బుమ్రా ఇచ్చిన పరుగులు 3912. ఈ మైలురాయి అందుకున్న బౌలర్లలో 4 వేలకంటే తక్కువ పరుగులు ఇచ్చింది అతడొక్కడే.

Current Affairs

కోనేరు హంపి

కోనేరు హంపి (37 ఏళ్లు) రెండోసారి ప్రపంచ ర్యాపిడ్‌ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా నిలిచింది. 2024, డిసెంబరు 29న న్యూయార్క్‌లో జరిగిన చివరి మూడు రౌండ్లలో వరుసగా రెండు డ్రాలు చేసుకుని, ఓ విజయం సాధించిన ఆమె 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొమ్మిదో రౌండ్లో వెంజున్‌ (చైనా), పదో రౌండ్లో కేథరీనా (రష్యా)తో పాయింట్లు పంచుకున్న హంపి, 11వ రౌండ్లో ఐరీన్‌ కరిస్మా (ఇండోనేసియా)పై గెలిచి టైటిల్‌ సొంతం చేసుకుంది.  8 పాయింట్లతో కేథరీనా (కాంస్యం)తో సమంగా నిలిచినప్పటికీ మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో వెంజున్‌ రజతం అందుకుంది.  2019లోనూ ఆమె ర్యాపిడ్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

Current Affairs

ఆస్ట్రేలియాకు ఎగుమతులు 64% పెరిగాయ్‌

భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతులు 2024, నవంబరులో 64.4 శాతం పెరిగి 643.7 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5,500 కోట్ల)కు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వస్త్రాలు, రసాయనాలు, వ్యవసాయ ఉత్పత్తుల వంటి రంగాల్లో ఆరోగ్యకర వృద్ధి ఇందుకు దోహదం చేసిందని తెలిపింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-నవంబరు మధ్య కాలంలో దేశ సరుకుల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 5.21 శాతం క్షీణించి 5.56 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.47,000 కోట్ల)కు పరిమితమయ్యాయని పేర్కొంది. మన దేశం, ఆస్ట్రేలియా 2022 డిసెంబరు 29న తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేశాయి. ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) చేసుకున్నాయి. ప్రస్తుతం దాని పరిధిని విస్తృతం చేయడానికి, సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నాయి.

Current Affairs

ఏపీ సీఎస్‌గా విజయానంద్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ 2024, డిసెంబరు 29న నియమితులయ్యారు. ఈయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. విజయానంద్‌ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం డిసెంబరు 31తో ముగుస్తుండటంతో ప్రస్తుత నియామకం జరిగింది.  వైఎస్సార్‌ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె విజయానంద్‌ స్వస్థలం. 2025 నవంబరులో విజయానంద్‌ పదవీ విరమణ చేయనున్నారు. 

Current Affairs

‘పీఎం కేర్స్‌’

కొవిడ్‌-19 సమయంలో కేంద్రం ప్రారంభించిన ‘పీఎం కేర్స్‌’ నిధికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.7,184 కోట్ల మేరకు విరాళాలు అందితే, 2022-23 సంవత్సరంలో అది కేవలం రూ.912 కోట్లకు పరిమితమైంది. 2020లో నిధిని ఏర్పాటు చేసిన అనంతరం ఇంత తక్కువ స్థాయిలో విరాళాలు అందడం ఇదే తొలిసారి.  2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1,938 కోట్ల విరాళాలు అందాయి. 2020-21లో విదేశాల నుంచి రూ.495 కోట్లు విరాళాలందగా, 2022-23నాటికి రూ.2.57కోట్లకు పడిపోయింది.  కరోనా మహమ్మారి వల్ల ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, నష్టపోయిన వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ ప్రధాని నిధిని ప్రారంభించింది.  

Current Affairs

‘కుటుంబ వినియోగ వ్యయం 2023-24’ నివేదిక

కేంద్ర గణాంకశాఖ ఇటీవల ‘కుటుంబ వినియోగ వ్యయం 2023-24’ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, పానీయాలు, చిరుతిళ్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ (శుద్ధి చేసిన ఆహారం) కోసమే దేశవ్యాప్తంగా ప్రజలు తమ నెలవారీ ఖర్చుల్లో అత్యధిక భాగాన్ని వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రజలు వీటిపై 9.84%, పట్టణవాసులు 11.09% ఖర్చు పెడుతున్నట్లు నివేదిక వెల్లడించింది.  గ్రామీణుల ఖర్చులో పండ్లు 6వ స్థానంలో ఉండగా, పట్టణ వాసుల జాబితాలో అది 4వ స్థానాన్ని ఆక్రమించింది. ఆహారం, ఆహారేతర అవసరాలకోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సగటున రూ.4,122, పట్టణ ప్రాంతాల్లో రూ.6,996 ఖర్చు చేస్తున్నారు. ఇందులో సిక్కిం వాసులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక వ్యయంతో తొలి స్థానాన్ని ఆక్రమించగా, ఛత్తీస్‌గఢ్‌ వాసులు చివరి స్థానానికి పరిమితమయ్యారు.