Posts

Government Jobs

ఎన్‌ఎల్‌సీలో ఎలక్ట్రీషియన్‌ పోస్టులు

తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సీ) ఎలక్ట్రీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 7 వివరాలు: ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌- 04 ఎలక్ట్రీషియన్‌- 03. అర్హత: టెన్త్‌, ఐటీఐ, సంబంధిత విభాగంలో ఫుల్‌టైం డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌ పోస్టుకు రూ.38,000; ఎలక్ట్రీషియన్‌కు రూ.30,000. వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌ పోస్టుకు అన్‌ రిజర్వ్‌డ్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.595; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్- సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.295. సూపర్‌వైజర్‌ పోస్టుకు ఎలక్ట్రీషియన్‌కు అన్‌ రిజర్వ్‌డ్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.486; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్- సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.236.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-12-2024. Website:https://www.nlcindia.in/new_website/index.htm

Current Affairs

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌-హురున్‌ ఇండియా జాబితా

స్వయం కృషితో కుబేరులుగా ఎదిగిన 200 మంది ఔత్సాహిక వాణిజ్య వేత్తల జాబితాను ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్, హురున్‌ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. ‘ఇండియాస్‌ టాప్‌ 200 సెల్ఫ్‌ మేడ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ద మిలేనియా 2024’ జాబితా అగ్రస్థానంలో అవెన్యూ సూపర్‌మార్ట్ప్‌ (డీమార్ట్‌) అధిపతి రాధాకిషన్‌ దమానీ (సంపద విలువ రూ.3.42 లక్షల కోట్లు) నిలిచారు. ఆయా సంస్థల విలువ ఆధారంగా వ్యవస్థాపకులకు ర్యాంకులు ఇచ్చారు. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ రెండో స్థానంలో నిలిచారు. ఈయన నికర సంపద ఏడాది కాలంలో 190% పెరిగింది.  ర్యాంకు   వ్యవస్థాపకులు కంపెనీ- విలువ (రూ.కోట్లు) 1  రాధాకిషన్‌ దమానీ      అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ 3,42,600 2  దీపిందర్‌ గోయల్‌   జొమాటో    2,51,900 3    శ్రీహర్ష మాజేటి, నందన్‌ రెడ్డి      స్విగ్గీ     1,01,300 4     దీప్‌ కర్లా, రాజేశ్‌ మాగో      మేక్‌మైట్రిప్‌       99,300 5  అభయ్‌ సాయ్‌      మాక్స్‌హెల్త్‌కేర్‌     96,100 ఫల్గుణి నాయర్‌ సహా 19 మంది మహిళలు జాబితాలో ఉన్నారు. జాబితాలో పిన్న వయస్కుడిగా జెప్టో వ్యవస్థాపకులు కైవల్య ఓహ్రా (21) నిలిచారు. అగ్రగామి 5 మంది స్వయంకృషీవలురు

Government Jobs

ఎన్‌ఎల్‌సీలో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు

తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సీ) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 14 వివరాలు: విభాగాలు: సైంటిఫిక్‌, మైక్రోబయాలజీ, మెకానికల్, సివిల్‌. అర్హత: సంబంధిత విభాగంలో ఫుల్‌టైం/ పార్ట్‌టైం డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. జీతం: నెలకు రూ.38,000. ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.595; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్- సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.295.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-12-2024. Website:https://www.nlcindia.in/new_website/index.htm

Current Affairs

ఐఎన్‌ఎస్‌ నిర్దేశక్‌ నౌక

కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి సంజయ్‌ సేథ్‌ 2024, డిసెంబరు 18న ‘ఐఎన్‌ఎస్‌ నిర్దేశక్‌’ నౌకను జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులో ఈ కార్యక్రమం జరిగింది. హిందు మహాసముద్ర జలాల కచ్చితమైన కొలతలు, సముద్ర సమగ్ర స్వరూప చిత్రాల రూపకల్పన దీనివల్ల సాకారమవుతుందని సంజయ్‌ సేథ్‌ తెలిపారు.  సాగర జలాల సరిహద్దులు, రంగులతో కూడిన పటాలను రూపొందించడం, నావిగేషన్‌ విధానంలో సముద్ర స్వరూప చిత్రపటాలు నిరంతరం నౌకాదళానికి అందజేసేలా దీన్ని రూపొందించారు.

Current Affairs

అంతరిక్షంలో చైనా కొత్త రికార్డు

అంతరిక్ష పరిశోధనల్లో చైనా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ దేశ వ్యోమగాములు కై షూఝె, సాంగ్‌ లింగ్‌డాంగ్‌లు 9 గంటలపాటు సుదీర్ఘంగా స్పేస్‌వాక్‌ చేసి చరిత్ర సృష్టించారు. వీరు షెంఝూ-19 అనే అంతరిక్ష నౌకా బృందంలో సభ్యులు. చైనాలో తయారుచేసిన ఫెయిటియాన్‌ రెండోతరం స్పేస్‌ సూట్లను వీరు ధరించారు. చైనాకు చెందిన తియాంగాంగ్‌ స్పేస్‌ సెంటర్‌ రోబోటిక్‌ కెమెరా వీరి స్పేస్‌వాక్‌ను చిత్రీకరించి బీజింగ్‌ ఏరోస్పేస్‌ నియంత్రణ కేంద్రానికి పంపింది. 2001 మార్చి 12న అమెరికా వ్యోమగాములు జేమ్స్‌ వూస్, సుసాన్‌ హల్మ్స్‌లు 8.56 గంటలు స్పేస్‌వాక్‌ చేయగా దీనిని చైనా వ్యోమగాములు అధిగమించారు. 

Government Jobs

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు(01/ 2026) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్ వాయు(01/ 2026) బ్యాచ్ నియామకం వివరాలు: అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి. ఎత్తు: పురుషులు 152 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1 (ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3 (మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పరీక్ష ఫీజు: రూ.550. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 07-01-2025. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు  చివరి తేదీ: 27-01-2025. ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 22-03-2025. ఎంపిక జాబితా వెల్లడి: 14-11-2025. Website:https://agnipathvayu.cdac.in/AV/  

Current Affairs

కేంద్రం నుంచి ఆంధ్రాకు వివిధ ప్రాజెక్టులు

2014-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,309 కోట్ల విలువైన 248 ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలు (రైల్వే వంతెనలు) మంజూరు చేసినట్లు రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ 2024, డిసెంబరు 18న లోక్‌సభలో తెలిపారు. ఫీడర్‌ స్థాయి సోలారైజేషన్‌ విధానం కింద ఆంధ్రప్రదేశ్‌కు లక్ష పంపులు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్‌ 2024, డిసెంబరు 18న లోక్‌సభలో తెలిపారు. ఈ పథకం కింద రైతులు తమ భూముల్లో 2 మెగావాట్ల వరకు సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని డిస్కంలకు విద్యుత్తును విక్రయించవచ్చన్నారు.

Current Affairs

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రముఖ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయాధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి పురస్కారం అందజేయనున్నారు. మొత్తం 14 రచనలను జ్యూరీ తెలుగు నుంచి సిఫారసు చేసింది. వాటిలో ‘దీపిక’కు అవార్డు దక్కింది. 2025 మార్చి 8న ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు. హిందీ రచయిత్రి గగన్‌ గిల్, ఆంగ్ల రచయిత్రి ఈస్టరిన్‌ కిరె సహా 21 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించనున్నాయి. 2024, డిసెంబరు 18న సమావేశమైన సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక మండలి వీరి పేర్లను ఖరారు చేసింది. ఒక్కొక్కరికి రూ.లక్ష బహుమతి, ప్రశంసాపత్రం అందజేస్తారు.

Current Affairs

రవిచంద్రన్‌ అశ్విన్‌

దాదాపు పదిహేనేళ్లపాటు భారత క్రికెట్‌కు సేవలందించిన ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (38) 2024, డిసెంబరు 18న అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తక్షణమే రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం అశ్విన్‌ బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మూడు ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. భారత్, ఆసీస్‌ మధ్య అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు (గులాబీ బంతి) అశ్విన్‌ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌. 2010 జూన్‌ 5న శ్రీలంకతో వన్డేలో అరంగేట్రం చేసిన అశ్విన్‌.. సుమారు 14 ఏళ్ల ఆరు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. 

Current Affairs

Kaun Des Ko Vasi: Venu Ki Diary

♦ Suryabala’s novel “Kaun Des Ko Vasi: Venu Ki Diary” was selected for the 34th Vyas Samman 2024.   ♦ This novel was published in 2018. Vyas Samman was instituted in 1991 by the KK Birla Foundation. ♦ The award is given to an outstanding Hindi literary work by an Indian citizen published during the last 10 years. It carries a cash prize of Rs.4 lakh, a citation and a plaque. ♦ Suryabala was born in Varanasi of Uttar Pradesh in 1943. ♦ Besides the Vyas Samman, the KK Birla Foundation has also instituted Saraswati Samman and Bihari Puraskar. ♦ The Saraswati Samman, which carries a cash prize of Rs.15 lakh, is given to an outstanding literary work by an Indian citizen in any of the languages included in Schedule VIII to the Constitution of India and published during a period of 10 years.