Posts

Current Affairs

Indian Grand Master D Gukesh

♦ Indian Grand Master D Gukesh climbed to a career-high No. 3 rankings in the latest FIDE classical ratings list released on 1 March 2025. ♦ He is third with an Elo rating of 2787, behind second-placed Hikaru Nakamura (2802) and Magnus Carlsen (2833).  ♦ Meanwhile, Arjun Erigaisi is fifth with an Elo rating of 2777. Also, Praggnanandhaa, who recently won the Tata Masters, is eighth with an Elo rating of 2758. ♦ Chess legend Viswanathan Anand has slipped out of the top-ten and is now 14th in the standings with an Elo rating of 2743. ♦ American GM Fabiano Caruana is fourth with an Elo rating of 2783, and Uzbek Nodirbek Abdusattorov (2773) is sixth.

Current Affairs

World Civil Defence Day

♦ World Civil Defence Day is celebrated annually on 1 March to raise awareness of civil defence strategies and the protection of people. ♦ The ninth General Assembly of the International Civil Defence Organisation designated the first day of March as a commemorative World Day of Civil Protection (Civil Defence) at the International Conference Centre in Geneva on December 18, 1990.  ♦ 2025 theme: “Civil Defence, Guarantee of Security for the Population.”

Current Affairs

సివిల్‌ అకౌంట్స్‌ డే

భారతదేశంలో ఏటా మార్చి 1న ‘సివిల్‌ అకౌంట్స్‌ డే’గా నిర్వహిస్తారు. 1976లో ఇదే రోజున ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌ (ఐసీఏఎస్‌) అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆ ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు దీన్ని జరుపుతున్నారు. భారత ప్రభుత్వం పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఆడిట్, అకౌంట్స్‌ విధులను వేరుచేస్తూ తీసుకొచ్చిన కీలక సంస్కరణలే ఐసీఏఎస్‌ స్థాపనకు మూలం. పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (పీఎఫ్‌ఎంఎస్‌)కు ఐసీఏఎస్‌ బాధ్యత వహిస్తుంది. ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌ (ఐసీఏఎస్‌)కు సిబ్బందిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుంది.

Current Affairs

యునెస్కో నివేదిక

ప్రపంచంలో 40 శాతం మందికి మాతృభాషలో లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ (జీఈఎం) బృందం వెల్లడించింది. బాలల వికాసంలో మాతృభాష ప్రభావాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నా విధానాల రూపకల్పనలో వెనుకబడ్డాయని అభిప్రాయపడింది. స్థానిక భాషల్లో ఉపాధ్యాయుల కొరత, మెటీరియల్‌ లేకపోవడం, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత మొదలైనవి ఈ పరిస్థితికి కారణాలని పేర్కొంది. 25వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘లాంగ్వేజెస్‌ మ్యాటర్స్‌: గ్లోబల్‌ గైడెన్స్‌ ఆన్‌ మల్టీలింగువల్‌ ఎడ్యుకేషన్‌’ పేరుతో జీఈఎం ఈ నివేదికను విడుదల చేసింది.

Current Affairs

ఎన్‌ఐటీ రవూర్కెలా

మారుతున్న వాతావరణ పరిస్థితుల్లోనూ సౌరఫలకాల నుంచి గరిష్ఠంగా విద్యుత్తును సంగ్రహించేలా కొత్త సాంకేతికతను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) రవూర్కెలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిపై పేటెంట్‌ను కూడా పొందారు. ఈ ఆవిష్కరణ సూర్యరశ్మి, ఉష్ణోగ్రతల్లో మార్పులకు వేగంగా స్పందిస్తుంది. విద్యుత్‌ హెచ్చుతగ్గులు లేకుండా మొత్తం వ్యవస్థను సమర్థంగా, స్థిరంగా పనిచేసేలా చూస్తుంది.  సౌరఫలకాలు ఉత్పత్తి చేసే శక్తి ఉష్ణోగ్రత, సూర్యరశ్మి తీవ్రతలో మార్పులకు అనుగుణంగా మారుతుంటుంది. చాలా శక్తి వృథా అవుతుంది కూడా. అయితే ఇలా వృథా కాకుండా వాతావరణ మార్పులకు అంతగా లోనుకాకుండా రోజు మొత్తం స్థిరంగా విద్యుత్తును ఉత్పత్తి చేసేలా కొత్త తరహా మ్యాగ్జిమం పవర్‌ పాయింట్‌ ట్రాకింగ్‌ (ఎంపీపీటీ)ను ఎన్‌ఐటీ రవుర్కేలా శాస్త్రవేత్తలు రూపొందించారు. 

Current Affairs

బ్లూ ఘోస్ట్‌

అమెరికాలోని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌ సంస్థకు చెందిన ‘బ్లూ ఘోస్ట్‌’ వ్యోమనౌక చందమామపై  విజయవంతంగా కాలుమోపింది. చందమామపై కూలిపోకుండా, పక్కకి పడిపోకుండా.. సరైన స్థితిలో వ్యౌమనౌకను దించిన తొలి ప్రైవేట్‌ సంస్థగా అది చరిత్ర సృష్టించింది.  చందమామ కక్ష్య నుంచి ఆటోపైలట్‌ సాయంతో బ్లూ ఘోస్ట్‌  జాబిల్లి ఈశాన్య భాగంలోని ఒక పురాతన అగ్నిపర్వత ప్రాంతంలో దిగింది. ల్యాండింగ్‌ విజయవంతంగా జరిగినట్లు ఫైర్‌ఫ్లై సంస్థకు చెందిన మిషన్‌ కంట్రోల్‌ కేంద్రం ధ్రువీకరించింది. పెద్ద శిలలు వంటి అవరోధాలను తప్పించుకుంటూ సురక్షితమైన ప్రదేశంలో అది దిగిందని పేర్కొంది. 

Current Affairs

యుకికి డబుల్స్‌ టైటిల్‌

భారత టెన్నిస్‌ స్టార్‌ యుకి భాంబ్రి కెరీర్‌లో తొలి ఏటీపీ 500 టైటిల్‌ సాధించాడు. దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో అలెక్సీ  పాపిరిన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి అతడు డబుల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. 2025, మార్చి 2న జరిగిన జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో యుకి- అలెక్సీ జోడీ 3-6, 7-6, 10-8తో హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్‌)- హెన్రీ ప్యాటెన్‌ (ఇంగ్లాండ్‌) జంటపై విజయం సాధించింది. 

Current Affairs

విదర్భకే రంజీ ట్రోఫీ

దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీలో విదర్భ విజేతగా నిలిచింది. ఆ జట్టు చరిత్రలో మూడోసారి టైటిల్‌ కైవసం చేసుకుంది. 2025, మార్చి 2న ముగిసిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా కేరళపై విదర్భ పైచేయి సాధించింది. 2017-18, 2018-19 సీజన్‌లలో టైటిల్‌ గెలుచుకున్న విదర్భ, 2024లో రన్నరప్‌గా నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 249/4తో అయిదో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విదర్భ.. మ్యాచ్‌ ముగిసే సమయానికి 143.5 ఓవర్లలో 9 వికెట్లకు 375 పరుగులు రాబట్టింది. 

Current Affairs

జీడీపీ వృద్ధి 6.5 శాతం

2024-25లో, 2025-26లో 6.5 శాతం మేర వాస్తవ జీడీపీ వృద్ధిని భారత్‌ నమోదు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది. దీని ద్వారా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు పెరుగుతుండడం, ఆర్థిక స్థిరత్వం ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది.  ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు కారణంగా అత్యంత కీలకమైన, సవాళ్లతో కూడిన వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టేందుకు భారత్‌కు అవకాశం ఉంటుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్య సాధనకు ఈ సంస్కరణలు తోడ్పడతాయని వివరించింది. 

Current Affairs

ఫిబ్రవరి జీఎస్‌టీ వసూళ్లు

2025, ఫిబ్రవరిలో జీఎస్‌టీ స్థూల వసూళ్లు 9.1% పెరిగి రూ.1.84 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ వినియోగం పెరగడం ఇందుకు కారణమైంది. దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్‌టీ వసూళ్లు 10.2% అధికమై రూ.1.42 లక్షల కోట్లుగాను; దిగుమతులపై జీఎస్‌టీ ఆదాయం 5.4 శాతం పెరిగి రూ.41,702 కోట్లుగాను నమోదయ్యాయి. కేంద్ర జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) రూ.35,204 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.43,704 కోట్లుగా ఉంది. ఐజీఎస్‌టీ రూ.90,870 కోట్లు, పరిహారం సెస్సు రూ.13,868 కోట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో మొత్తం రిఫండ్‌లు 17.3% పెరిగి రూ.20,889 కోట్లకు చేరాయి. నికర జీఎస్‌టీ వసూళ్లు 8.1% వృద్ధితో రూ.1.63 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.