Posts

Current Affairs

Vandana Katariya

♦ Indian women’s hockey stalwart Vandana Katariya announced her retirement from international hockey on 1 April 2025. ♦ She scored 158 goals in 320 international matches after making her debut for India in 2009. Vandana departs as the most-capped player in the history of Indian women’s hockey.  ♦ At the Tokyo 2020 Olympics, where she became the first and only Indian woman to score a hat-trick at the Games. ♦ She also represented India at the Rio 2016 Olympics, two FIH Hockey Women’s World Cups in 2018 and 2022, three consecutive Commonwealth Games from 2014 to 2022 as well as three successive Asian Games from 2014 to 2022. ♦ Vandana Katariya also won silver medals at the Asian Games 2018, Women's Asian Champions Trophy Japan 2013 and Women's Asian Champions Trophy Donghae 2018. ♦ Vandana was honoured with some of India’s most prestigious awards, including the Arjuna Award (2021) and the Padma Shri (2022). ♦ She also received the Hockey India Balbir Singh Sr. Award for Player of the Year (Women) in 2014, the Hockey India President’s Award for Outstanding Achievement in 2021, and the Hockey India Dhanraj Pillay Award for Forward of the Year in 2021 and 2022, cementing her status as one of India’s finest forwards.

Current Affairs

Narendra Modi met with Chilean President Gabriel Boric Font

♦ Prime Minister Narendra Modi met with Chilean President Gabriel Boric Font at Hyderabad House on 1April 2025. ♦ The two leaders held discussions aimed at enhancing bilateral relations across various sectors, including economic, commercial, and societal domains. ♦ Chilean President Gabriel Boric Font arrived in New Delhi on April 1 for a five-day state visit to India. ♦ As part of the visit, several Memoranda of Understanding (MoUs) were exchanged, including agreements on Antarctica cooperation, cultural exchange programs, and disaster management. ♦ The leaders expressed confidence that the agreements signed would pave the way for deeper engagement between the two nations.

Current Affairs

కాగ్నిజెంట్‌ జీసీసీ సర్వీస్‌లైన్‌ గ్లోబల్‌ హెడ్‌

అంతర్జాతీయ టెక్‌ సంస్థ కాగ్నిజెంట్, తన గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌(జీసీసీ) సర్వీస్‌ లైన్‌కు గ్లోబల్‌ హెడ్‌గా తెలుగువారైన శైలజా జోస్యుల నియమితులయ్యారు. ఈమె హైదరాబాద్‌ కేంద్రంగా కాగ్నిజెంట్‌ అంతర్జాతీయ జీసీసీ కార్యకలాపాల వ్యూహాలు రూపొందిస్తారు. కాగ్నిజెంట్‌లోనే 2018-24 మధ్య పలు నాయకత్వ హోదాల్లో ఈమె పనిచేశారు. కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌ సెంటర్‌ అధిపతిగా, బీఎఫ్‌ఎస్‌ఐ కార్యకలాపాల డెలివరీ విభాగం అధిపతిగా వ్యవహరించారు కూడా. 

Current Affairs

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు

2025, మార్చిలో జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లకు చేరాయి. 2024 మార్చి వసూళ్లయిన రూ.1.78 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 9.9% అధికం.  జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక ఒక నెలకు సంబంధించి రెండో అత్యధిక వసూళ్లు ఈ మార్చిలోనే నమోదయ్యాయి. 2024, ఏప్రిల్‌లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు ఇప్పటివరకు అత్యధిక వసూళ్లుగా ఉన్నాయి. 2024-25 మొత్తంమీద రూ.22.08 లక్షల కోట్లు వసూలయ్యాయి.

Current Affairs

గాబ్రియేల్‌ బోరిక్‌తో మోదీతో భేటీ

అయిదు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్‌ బోరిక్‌ 2025, ఏప్రిల్‌ 1న దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రక్షణ, ఆరోగ్యం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, రైల్వేలు, అంతరిక్షం సహా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.   అంటార్కిటికాలో పరిశోధనలకు సహకారం సహా ఇరు దేశాలు నాలుగు కీలక పత్రాలపై సంతకాలు చేశాయి. 

Current Affairs

పరమాణు పరిశోధనకు సరికొత్త ప్రాజెక్టు

విశ్వం ఎలా ఏర్పడింది, ఎలా పనిచేస్తోంది అన్న అంశంపై నిరంతరం అణు పరిశోధన చేస్తున్న సెర్న్‌ (యూరోపియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రిసెర్చ్‌) సంస్థ మరిన్ని భౌతిక శాస్త్ర రహస్యాల్ని ఛేదించేందుకు ఒక భారీ అణు విచ్ఛిత్తి వ్యవస్థను రూపొందించే ప్రణాళిక సిద్ధం చేసింది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌ సరిహద్దు వద్ద 91 కిలోమీటర్ల భారీ విస్తృతిలో నిర్మించదలచిన ఈ అణు విచ్ఛిత్తి వ్యవస్థకు ‘ఫ్యూచర్‌ సర్క్యులర్‌ కొలైడర్‌’ (ఎఫ్‌సీసీ)గా నామకరణం చేశారు. ఈ వ్యవస్థ సాయంతో 2040 సంవత్సర మధ్యకల్లా ఇప్పటి వరకూ తెలిసిన భౌతికశాస్త్ర పరిజ్ఞానంపై తిరిగి అధ్యయనం చేసి మరిన్ని కొత్త వివరాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తారు. 

Current Affairs

‘టైగర్‌ ట్రంప్‌-25’ విన్యాసాలు

భారత్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘టైగర్‌ ట్రంప్‌-2025’ సముద్ర విన్యాసాలు 2025, ఏప్రిల్‌ 1న విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంత భద్రతను పెంపొందించడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం.  ‘ఐఎన్‌ఎస్‌ జలశ్వ’ నౌకపై విన్యాసాలు ప్రారంభం కాగా.. ముగింపు వేడుకలు ఏప్రిల్‌ 13న కాకినాడ తీరాన అమెరికా నౌక ‘యూఎస్‌ఎస్‌-కాంస్టాక్‌’పై జరగనున్నాయి. 

Current Affairs

ఫిదెల్‌ స్నేహిత్‌

తాజా ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌లో భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు ఫిదెల్‌ స్నేహిత్‌ 89వ స్థానంలో నిలిచాడు. ఇటీవల డబ్ల్యూటీటీ స్టార్‌ కంటెండర్‌ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన స్నేహిత్‌.. 34 స్థానాలు మెరుగయ్యాడు. భారత్‌ తరఫున స్నేహిత్‌ కాకుండా మానవ్‌ థక్కర్‌ (47వ ర్యాంకు), హర్మీత్‌ దేశాయ్‌ (68), మనుష్‌ షా (73), శరత్‌ కమల్‌ (80) టాప్‌-100లో ఉన్నారు.

Current Affairs

వందన కటారియా

భారత మహిళల హాకీ వెటరన్‌ ప్లేయర్‌ వందన కటారియా 2025, ఏప్రిల్‌ 1న ఆటకు వీడ్కోలు ప్రకటించింది. హరిద్వార్‌కు చెందిన వందన 2009లో అరంగేట్రం చేసింది. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఈ స్ట్రైకర్‌.. 320 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్‌ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ చేసిన ఆమె ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా నిలిచింది.  హాకీలో వందన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ (2022), అర్జున (2021) పురస్కారాలు దక్కాయి.

Walkins

నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరాటరీస్‌లో పోస్టులు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబారాటరీస్‌ (ఎన్‌ఏఎల్‌) ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 20  వివరాలు: 1. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్-2: 11 2. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 01 3. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 08 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌లో (మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 ఏళ్లు. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-2కు రూ.20,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1కు రూ.25,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2కు రూ.28,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7 వేదిక: సీఎస్‌ఐఆర్‌-నాల్ (రాబ్‌ మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్), ఎస్‌బీఐ పక్కన, నాల్‌ బ్రాంచ్, కోడిహల్లి, బెంగళూరు - 560017. Website:https://www.nal.res.in/en/news/walk-interview-project-staff-advt-no-082025