Posts

Current Affairs

India-Australia Economic Cooperation and Trade Agreement (Ind-Aus ECTA)

♦ The India-Australia Economic Cooperation and Trade Agreement (Ind-Aus ECTA) marks its third anniversary of signing on 2 April 20525, a landmark achievement that has enhanced the economic partnership between India and Australia. ♦ Since the agreement's signing on 2nd April 2022, it has created pathways for robust trade, offering new avenues for businesses, entrepreneurs, and employment across both nations.  ♦ With the signing of the ECTA, India and Australia have fostered new economic opportunities, underlining the complementary strengths of both economies. ♦ Following the signing and implementation of the agreement, total bilateral trade reached USD 24 billion in 2023-24, marking an impressive 14% growth in India’s exports to Australia as compared to 2022-23.  ♦ The ECTA has brought tangible benefits across several sectors, notably textiles, pharmaceuticals, chemicals, and agriculture. ♦ Exports on new lines, such as Calcined Petroleum Coke, High-Capacity Diesel Generating Sets, and Air Liquefaction Machinery, demonstrate the expanding trade opportunities facilitated by the agreement. ♦ Sectors like electronics and engineering hold significant potential for future exports, offering promising prospects for further growth and innovation.

Current Affairs

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా 2025, ఏప్రిల్‌ 2న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా మూడేళ్ల పాటు గుప్తా పనిచేయనున్నారు. జనవరిలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎండీ పాత్రా వైదొలిగిన తర్వాత నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది.   ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మండలిలో సభ్యురాలిగా కూడా గుప్తా ఉన్నారు. 

Current Affairs

పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌గా ఎస్‌.రామన్‌

పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఛైర్‌పర్సన్‌గా శివసుబ్రమణియన్‌ రామన్‌ను ప్రభుత్వం నియమించింది. 2025 మేలో పదవీ కాలం ముగియనున్న దీపక్‌ మొహంతి స్థానాన్ని రామన్‌ భర్తీ చేస్తారు. ఈయన 1991 బ్యాచ్‌ ఐఏఅండ్‌ఏఎస్‌ (ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీస్‌) అధికారి. ప్రస్తుతం డిప్యూటీ కాగ్‌గా పని చేస్తున్నారు. ఇంతకు ముందు 2021-24 మధ్య మూడేళ్లపాటు సిడ్బీ ఛైర్మన్, ఎండీగానూ పని చేశారు.

Current Affairs

ఫోర్బ్స్‌ ప్రపంచ బిలియనీర్ల జాబితా-2025

మొత్తం 3028 మందితో ఫోర్బ్స్‌ ప్రపంచ బిలియనీర్ల జాబితా-2025ను విడుదల చేసింది. ప్రపంచంలో 3000 మందికి పైగా కుబేరులు నమోదవ్వడం ఇదే తొలిసారి. గత ఏడాది వ్యవధిలో వీరంతా సగటున రోజుకు రూ.46,000 కోట్లకు పైగా సంపాదించారని ఫోర్బ్స్‌ తెలిపింది. సంవత్సరకాలంలో వీరి సంపద విలువ 2 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు రూ.170 లక్షల కోట్లు) పెరగడంతో, వీరి మొత్తం సంపద 16.1 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.  ముఖ్యాంశాలు: ఫోర్బ్స్‌ ప్రపంచ ర్యాంకుల ప్రకారం, 18వ స్థానంలో నిలిచిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భారత్‌లో, ఆసియాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈయన సంపద విలువ 92.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అదానీ (28వ ర్యాంకు) 56.3 బి.డాలర్లతో దేశీయంగా రెండో స్థానంలో, ఆసియాలో నాలుగో స్థానంలో ఉన్నారు. చైనా టిక్‌టాక్‌కు చెందిన జాంగ్‌ ఇమింగ్‌ (23వ ర్యాంకు), నోంగ్‌ఫు స్ప్రింగ్‌ వ్యవస్థాపకుడు ఝాంగ్‌ శాన్‌శాన్‌ (26) ఆసియాలో వరుసగా 2, 3 ర్యాంకుల్లో ఉన్నారు.  2024 జాబితాలో మస్క్‌ సంపద విలువ 195 బిలియన్‌ డాలర్లు కాగా, ప్రస్తుతం 342బి.డా.కు పెరిగింది. తాజా జాబితాలో ఆయనే మొదటి స్థానంలో నిలిచారు.  అగ్రగామి ప్రపంచ కుబేరులు ర్యాంకు       పేరు  నికర సంపద (బిలియన్‌ డాలర్లు)    1 ఎలాన్‌ మస్క్‌          342        2   మార్క్‌ జుకర్‌బర్గ్‌         216    3  జెఫ్‌ బెజోస్‌         215    4  లారీ ఎలిసన్‌        192    5 బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌         78    6  వారెన్‌ బఫెట్‌         154    7  లారీ పేజ్‌        144    8  సెర్గీ బ్రిన్‌        138    9   అమాన్షియో ఒర్టెగా        124    10  స్టీవ్‌ బామర్‌        118  

Current Affairs

వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు

వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ నుంచి 2025, ఏప్రిల్‌ 2న ధ్రువీకరణ పత్రం అందించింది. తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్‌ చపాటా మిరప 18వది. పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్‌ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్‌ వర్సిటీ.. జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీకి దరఖాస్తులు సమర్పించాయి. వీటిపై అధ్యయనం చేసిన రిజిస్ట్రీ తాజాగా భౌగోళిక గుర్తింపునకు ఆమోద ముద్ర వేస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది.

Current Affairs

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)

చంద్రుడిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టే దిశగా బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు కీలక పద్ధతిని అభివృద్ధి చేశారు. జాబిల్లి ఉపరితలంపై భవనాలు నిర్మించేందుకు ఇటుకలు ఉపయోగిస్తే అవి అక్కడి తీవ్రమైన వేడి, చలి కారణంగా బీటలువారే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు బ్యాక్టీరియాను ఉపయోగించే పద్ధతిని ఐఐఎస్‌సీ ఆవిష్కరించింది. ఈ మేరకు శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను ‘ఫ్రాంటియర్స్‌ ఇన్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌’ అనే జర్నల్‌లో ప్రచురించారు.  చంద్రుడిపై వాతావరణం కఠినంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఒక్కరోజులో 121 డిగ్రీల సెల్సియస్‌ దాకా పెరిగి.. మైనస్‌ 133 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పడిపోతూ ఉంటుంది. అంతేకాక తీక్షణమైన సౌర పవనాలు, తోకచుక్కలు అక్కడ నిత్యకృత్యమే. అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో ‘స్పోరోసార్సినా పాశ్చరీ’ అనే బ్యాక్టీరియాను ఉపయోగించడం ద్వారా తీవ్ర తాపం వల్ల ఇటుకల్లో కలిగే పగుళ్లను నివారించవచ్చని పరిశోధకులు నిరూపించారు.

Current Affairs

భారత్‌పై ప్రతీకార సుంకం 26%

ప్రపంచ దేశాలన్నీ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని, అయితే కనీసం 10% సుంకం చెల్లించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. భారత్‌ తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, తాము 26% సుంకం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. 2025, ఏప్రిల్‌ 2న వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌ రోజ్‌గార్డెన్‌లో తన క్యాబినెట్‌ సహచరుల సమక్షంలో ట్రంప్‌ వివిధ దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలను వెల్లడించారు. వీటికి సంబంధించిన అధికారిక ఆదేశాలపై సంతకం చేశారు.

Internship

ఎక్రాస్‌ ది గ్లోబ్‌లో కంటెంట్‌ రైటింగ్‌ పోస్టులు

ఎక్రాస్‌ ది గ్లోబ్‌ కంపెనీ.. కంటెంట్‌ రైటింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:  పోస్టు: కంటెంట్‌/ ప్రపోజల్‌ రైటింగ్‌ (టెక్నికల్‌) సంస్థ: ఎక్రాస్‌ ది గ్లోబ్‌ (ఏటీజీ)  నైపుణ్యాలు: బ్లాగింగ్, కంటెంట్‌ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌.  స్టైపెండ్‌: నెలకు రూ.1,500-2,500. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 21.04.2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-part-time-content-proposal-writing-technical-internship-at-across-the-globe-atg1742556257

Government Jobs

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో పోస్టులు

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్‌) మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: మేనేజర్‌: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 37 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.60,000 - 1,80,000. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. చిరునామా: జేజీఎం, హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌, సీ-4, డిస్ట్రిక్‌ సెంటర్‌, సాకెట్‌, న్యూ దిల్లీ-110017. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 25-05-2025. Website:https://ircon.org/index.php?option=com_content&view=article&layout=edit&id=92&Itemid=496&lang=en