Posts

Internship

ఫార్మాప్రోలో మార్కెట్‌ రిసెర్చ్‌ పోస్టులు

ఫార్మాప్రో కంపెనీ మార్కెట్‌ రిసెర్చ్‌ పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: మార్కెట్‌ రిసెర్చ్‌  సంస్థ: ఫార్మాప్రో నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌- పవర్‌పాయింట్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌  స్టైపెండ్‌: నెలకు రూ.10,000. వ్యవధి: 2 నెలలు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 19-04-2025 Website: https://internshala.com/internship/detail/work-from-home-market-research-internship-at-pharmapro1742464319

Internship

వెబినైజర్‌ లిమిటెడ్‌లో స్టార్టప్‌ వెంచర్‌ ల్యాబ్‌ ఆపరేషన్స్‌ పోస్టులు

వెబినైజర్‌ లిమిటెడ్‌ స్టార్టప్‌ వెంచర్‌ ల్యాబ్‌ ఆపరేషన్స్‌ పోస్టులు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: స్టార్టప్‌ వెంచర్‌ ల్యాబ్‌ ఆపరేషన్స్‌  సంస్థ: వెబినైజర్‌ లిమిటెడ్‌  నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెట్‌ అనాలిసిస్, మార్కెటింగ్, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ప్రొడక్ట్‌ స్ట్రాటజీ స్టైపెండ్‌: రూ.10,000- రూ.25,000 వ్యవధి: 3 నెలలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 19-04-2025 Website: https://internshala.com/internship/detail/work-from-home-startup-venture-lab-operations-internship-at-webiniser-ltd1742462179

Government Jobs

ఎస్‌పీఎంఎన్‌లో సెక్యూరిటీ మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు

సెక్యూరిటీ పేపర్ మిల్‌ నర్మదాపురం (ఎస్‌పీఎంఎన్‌) వివిధ విభాగాల్లో సెక్యూరిటీ మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 64 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.55,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా చిరునామా: చీఫ్‌ జనరల్ మేనేజర్‌, సెక్యూరిటీ పేపర్‌ మిల్, నర్మదాపురం(మధ్యప్రదేశ్‌)-461005. దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2025 Website: https://spmnarmadapuram.spmcil.com/en/discover-spmcil/#career/

Government Jobs

ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటిలో ఫ్యాకల్టీ పోస్టులు

ఇండియన్‌ మారిటైమ్‌ యూనిర్సిటీ (ఐఎంయూ) వివిధ విభాగాల్లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. అసోసియేట్‌ ప్రొఫెసర్‌(ఓషన్‌ ఇంజినీరింగ్‌): 01 2. అసిస్టెంట్ ప్రొఫెసర్‌(ఓషన్‌ ఇంజినీరింగ్‌): 01 3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(మ్యాథ్స్‌): 05 4. అసిస్టెంట్ ప్రొఫెసర్‌(మెకానికల్ ఇంజినీరింగ్‌): 03 విభాగాలు: ఓషన్‌ ఇంజినీరింగ్, మ్యాథ్స్‌, మెకానికల్ ఇంజినీరింగ్‌ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: అసోసియేట్ ప్రొఫెసర్‌కు 60 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.37,400 - రూ.67,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.15,600 - రూ.39,100. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21 ఏప్రిల్‌ 2025 Website: https://www.imu.edu.in/imunew/recruitment Apply online: https://imurec.samarth.edu.in/

Admissions

టీజీ ఎడ్‌సెట్‌-2025

తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి టీజీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2025 నోటిఫికేషన్‌ను తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.  వివరాలు: టీజీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీ ఎడ్‌సెట్‌) 2025 అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.  రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.550; ఇతరులకు రూ.750. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 13-05-2025. ఆలస్య రుసుము రూ.250తో దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2025. ఆలస్య రుసుము రూ.500తో దరఖాస్తుకు చివరి తేదీ: 24.05.2025. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభ తేదీ: 29.05.2025. ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష తేదీ: 01-06-2025. ప్రిలిమినరీ కీ: 05.06.2025. ఫైనల్‌ కీ: 21.06.2025. Website: https://edcet.tgche.ac.in/

Admissions

ఏపీ ఈఏపీసెట్‌-2025

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (ఈఏపీసెట్‌) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.  వివరాలు: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (ఏపీ ఈఏపీసెట్‌) 1. ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, బీటెక్‌ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌), బీటెక్‌ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) 2. బీఎస్సీ (అగ్రి)/ బీఎస్సీ (హార్జికల్చర్‌)/ బీవీఎస్సీ & ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ. 3. బీఫార్మసీ, ఫార్మ్.డి అర్హత: ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి.  రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.600(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500; బీసీ అభ్యర్థులకు రూ.550).  మార్చి 15- ఏప్రిల్‌ 24 వరకు: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణ ఏప్రిల్‌ 25- మే 16 వరకు: రూ.1000 నుంచి రూ.10 వేల వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం మే 12 నుంచి: డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ల అందుబాటు ఈఏపీసెట్‌ పరీక్షలు: త్వరలో వెల్లడికానున్నాయి. అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసి పరీక్షల తేదీలు: మే 19, 20 ఇంజినీరింగ్‌ పరీక్ష తేదీలు: మే 21 నుంచి 27వ తేదీ వరకు. ప్రిలిమినరీ కీ (అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసి): మే 21 ప్రిలిమినరీ కీ (ఇంజినీరింగ్‌): మే 28 తుది కీ: జూన్‌ 6 Website: https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx Apply online: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

Current Affairs

గురిందర్‌వీర్‌ జాతీయ రికార్డు

పురుషుల 100 మీటర్ల పరుగులో గురిందర్‌వీర్‌ సింగ్‌ జాతీయ రికార్డు సృష్టించాడు. 2025, మార్చి 28న బెంగళూరులో జరిగిన ఇండియన్‌ గ్రాండ్‌ప్రి-1 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈ పంజాబ్‌ స్ప్రింటర్‌ 10.20 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 2023లో మణికంఠ హోబ్లిధార్‌ (10.23 సె) సృష్టించిన రికార్డును అధిగమించాడు. 2021లో కెరీర్‌లో ఉత్తమంగా 10.27 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేసిన గురిందర్‌.. ఇండియన్‌ గ్రాండ్‌ప్రిలో అంతకుమించిన ప్రదర్శన చేసి జాతీయ రికార్డును సొంతం చేసుకున్నాడు.  మణికంఠ (10.22 సెకన్లు) రెండో స్థానంతో ఉండగా, అమ్లాన్‌ బోర్గొహైన్‌ (10.43 సె) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. 

Current Affairs

ఆసియా రెజ్లింగ్‌

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల ఫ్రీస్టైల్‌ 62 కిలోల విభాగంలో భారత్‌కి చెందిన మనీషా బన్వాలా స్వర్ణం నెగ్గింది. 2025, మార్చి 28న అమ్మాన్‌ (జోర్డాన్‌)లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మనీషా 8-7తో ఒక్‌ కిమ్‌ (ఉత్తర కొరియా)ను ఓడించింది. ప్రస్తుత టోర్నీలో భారత్‌కు దక్కిన తొలి పసిడి ఇదే.  మరోవైపు అంతిమ్‌ ఫంగాల్‌ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 53 కిలోల విభాగం కంచు పోరులో ఆమె 10-0తో మింగ్‌ సువాన్‌ (చైనీస్‌ తైపీ)ని చిత్తు చేసింది. 

Current Affairs

ప్రచండ్‌

మొత్తం 156 ప్రచండ్‌ హెలికాప్టర్ల కోసం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో రూ.62,700 కోట్ల విలువైన రెండు ఒప్పందాలను రక్షణ శాఖ 2025, మార్చి 28న కుదుర్చుకుంది. ఇందులో వాయుసేనకు 66, సైన్యానికి 90 హెలికాప్టర్లు చేరతాయి. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత తొలి తేలికపాటి పోరాట హెలికాప్టర్‌ ‘ప్రచండ్‌’. ఇది 5వేల మీటర్లకుపైగా ఎత్తుకు చేరుకోగలదు. పర్వత ప్రాంతాల్లో అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదు. 

Current Affairs

ఎలక్ట్రానిక్స్‌ కాంపోనెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ స్కీమ్‌

దేశీయంగా సెమీకండక్టర్‌ యేతర (పాసివ్‌) ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల ఉత్పత్తి పెంచేందుకు రూ.22,919 కోట్ల కేటాయింపులతో ‘ఎలక్ట్రానిక్స్‌ కాంపోనెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ స్కీమ్‌’కు 2025, మార్చి 28న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పాసివ్‌ ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీ ప్రోత్సాహానికి తలపెట్టిన తొలి పథకం ఇదే. ఆరేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకం ద్వారా రూ.59,350 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 91,600 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.