Posts

Current Affairs

బీఈఎల్‌కు రూ.2,385 కోట్ల ఆర్డర్‌

రక్షణ మంత్రిత్వశాఖ 2025, ఏప్రిల్‌ 7న బెంగళూరు కేంద్రంగా పనిచేసే భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)తో సుమారు రూ.2,385 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం స్టేట్‌ ఆఫ్‌ ద ఆర్ట్‌ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ (ఈడబ్ల్యూ) సూట్స్, భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లలో ఎయిర్‌క్రాఫ్ట్‌ మోడిఫికేషన్‌ కిట్స్‌..వాటి ఇన్‌స్టాలేషన్‌ను అందించాలి. కీలకమైన ఈ సూట్‌తో ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్‌ పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపింది.

Current Affairs

జాతీయ ఇంధన గణాంకాలు-2025 నివేదిక

గత పదేళ్ల(2014-24)లో వ్యవసాయానికి వినియోగించిన కరెంటు వార్షిక సగటు వృద్ధి రేటు 4.68 శాతమని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘భారత ఇంధన గణాంకాలు-2025’ నివేదికలో స్పష్టం చేసింది. పరిశ్రమలకు 4.93, ఇళ్లకు 6.24, వాణిజ్య కనెక్షన్లకు 5.32, రైల్వేలకు 8.24, ఇతర వర్గాలకు 9.33 శాతం చొప్పున వృద్ధి రేటు నమోదైందని తెలిపింది.  గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో దేశ మొత్తం మీద వినియోగించిన 15.43 లక్షల గిగావాట్ల యూనిట్ల కరెంటులో ప్రధానంగా.. వ్యవసాయానికి 16.53 శాతం, పరిశ్రమలకు 41.80, ఇళ్లకు 24.30 శాతం వినియోగించినట్లు నివేదిక వివరించింది. మిగతాది ఇతర అవసరాలకు వినియోగించినట్లు వెల్లడించింది. 2014-15లో దేశంలో వ్యవసాయానికి వాడిన కరెంటు లక్షా 68 వేల గిగావాట్లు కాగా 2023-24లో 2.55 లక్షల గిగావాట్లకు చేరిందని తెలిపింది.

Current Affairs

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2024-25లో ప్రయాణికుల రాకపోకల్లో 15.20 శాతం వృద్ధి సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 2.13 కోట్ల మంది ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణించారు.   2024-25లో చివరి మూడు నెలలు (జనవరి నుంచి మార్చి వరకూ) దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ శంషాబాద్‌ అరుదైన ఘనతను సాధించింది. ఇక్కడి నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్ఠంగా 20 లక్షలే కాగా.. ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈ విషయంలో హైదరాబాద్‌.. జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్‌కతాలను దాటేసింది. అలాగే తన రోజువారీ గరిష్ఠ సగటు ప్రయాణికుల సంఖ్య 75 వేలను కూడా శంషాబాద్‌ జనవరి 18న అధిగమించింది. ఆ ఒక్కరోజే 94 వేల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అధికారికంగా వెల్లడించింది. 

Current Affairs

డిసౌజాతో ముర్ము భేటీ

రెండ్రోజుల పర్యటన నిమిత్తం పోర్చుగల్‌ వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, ఏప్రిల్‌ 7న ఆ దేశ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజాతో లిస్బన్‌లో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన ముఖ్యాంశాలన్నింటిపై ఇద్దరు నేతలు చర్చించినట్లు పోర్చుగల్‌ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ వేదికలపై పరస్పరం సహకరించుకోవాలని భారత్, పోర్చుగల్‌ నిర్ణయించుకున్నాయి.

Current Affairs

హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పార్థసారథి

గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) వైవీఎస్‌బీజీ పార్థసారథి 2025, ఏప్రిల్‌ 7న ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఈయన 1967లో కాకినాడలో జన్మించారు. 2003లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు అదనపు జడ్జిగా.. అనంతరం 2010లో నేరుగా అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ అక్కడి నుంచి 2022లో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Government Jobs

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్‌) ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్‌) (01/ 2026) నోటిషికేషన్‌ విడుదల చేసింది.  వివరాలు: భారత వాయుసేన- అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్‌) ఇన్‌టేక్‌ 01/2026 మ్యూజిక్‌ నైపుణ్యాలు: కన్సర్ట్‌ ప్లూట్‌/ పికోలో,  ఒబో, Eb / Bbలో క్లారినెట్, Eb / Bbలో సాక్సోఫోన్, F /Bbలో ఫ్రెంచ్ హార్న్, Eb /C /Bbలో ట్రంపెట్, Bb/Gలో ట్రోంబోన్, యుఫోనియం, Eb /Bbలో బాస్ / ట్యూబా, కీబోర్డ్ / ఆర్గాన్ / పియానో, గిటార్ (అకౌస్టిక్ / లీడ్ / బాస్), వయోలిన్, వయోలా, స్ట్రింగ్ బాస్, అన్ని భారతీయ శాస్త్రీయ వాయిద్యాల్లోని ఏదైనా ఒక దాంట్లో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.  అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యూలేషన్‌/ టెన్త్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు, మ్యూజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. వాయిద్య పరికరం వాయించడంలో ప్రావీణ్యం తప్పనిసరి. ఎత్తు: పురుషులు 162 సెం.మీ. మహిళా అభ్యర్థులకు 152 కనీస ఎత్తు ఉండాలి. వయోపరిమితి: 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు. జీతం: మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000; మూడో ఏడాది రూ.36,500; నాలుగో ఏడాది రూ.40,000. ఎంపిక ప్రక్రియ: మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఇంగ్లిష్‌, అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.100. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21-04-2025. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 11-05-2025. రిక్రూట్‌మెంట్ ర్యాలీ షెడ్యూల్: జూన్‌ 10 నుంచి 18-06-2025 వరకు. ర్యాలీ వేదిక: జూన్‌ 10 నుంచి 18-06-2025 వరకు. ర్యాలీ వేదిక: 2 ఏఎస్‌సీ సీ/ఓ రేస్ కోర్స్ క్యాంప్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూ ఢిల్లీ (న్యూఢిల్లీ), 7 ఏఎస్‌సీ, నెం.1 కబ్బన్ రోడ్, బెంగళూరు (కర్ణాటక). Website:https://agnipathvayu.cdac.in/AV/

Government Jobs

దిల్లీ జల్‌బోర్డ్‌లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని దిల్లీ జల్‌ బోర్డ్‌ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గేట్‌ స్కోర్‌ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు.  మొత్తం పోస్టులు: 131 వివరాలు: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. జీతం: నెలకు రూ.54,162. ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈ మెయిల్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా. ఈమెయిల్‌:djbdirector@gmail.com లేదా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్‌, రూం నెం.202, దిల్లీ జల్‌ బోర్డ్‌, వరుణాలయ ఫెజ్‌2, కరోల్‌ భాగ్‌, న్యూదిల్లీ. దరఖాస్తులకు చివరి తేదీ: 15.04.2025. Website:https://delhijalboard.delhi.gov.in/recruitment

Government Jobs

సీపెట్‌లో వివిధ పోస్టులు

చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) ఒప్పంద ప్రాతిపదకన కింది పోస్టుల  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు:  1. కన్సల్టెంట్‌ (స్కిల్‌ డెవెలప్‌మెంట్‌)- 02 2. అనలిస్ట్‌ (స్కిల్‌ డెవెలప్‌మెంట్‌) 03 3. క్వాలిఫైడ్‌/ సెమీ క్వాలిఫైడ్‌ సీఏ/సీఎంఏ- 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు కన్సల్టెంట్‌కు రూ.70,000; అనలిస్ట్‌కు రూ.50,000; క్వాలిఫైడ్‌/ సెమీ క్వాలిఫైడ్‌ సీఏ/సీఎంఏకు రూ.35,000-రూ.70,000. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21.04.2025. Website:https://www.cipet.gov.in/

Government Jobs

ఎయిమ్స్‌ గువహటిలో ట్యూటర్‌ పోస్టులు

గువాహటిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) నర్సింగ్‌ కాలేజీలో డైరెక్ట్‌ రిక్యూట్‌మెంట్‌ ప్రాతిపదికన ట్యూటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: ట్యూటర్‌/ క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌- 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్‌/ పోస్ట్‌ బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి: 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.56,100- రూ.1,77,500. దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05-05-2025. Website:https://aiimsguwahati.ac.in/page/recruitapplication

Admissions

కర్నూలు సిల్వర్ సెట్‌-2025

కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల (కో ఎడ్యుకేషన్‌, అటానమస్).. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘సిల్వర్‌ సెట్‌-2025’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వివిధ యూజీ నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సు(ఇంగ్లిష్ మీడియం)ల్లో ప్రవేశాలు పొందవచ్చు.  వివరాలు: సిల్వర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025  నాలుగేళ్ల బీఏ/ బీకాం/ బీఎస్సీ ఆనర్స్‌ కోర్సులు  అందించే కోర్సులు: 1. బీకాం - జనరల్: 20 సీట్లు 2. బీకాం- కంప్యూటర్ అప్లికేషన్స్: 20 సీట్లు 3. బీఏ- హిస్టరీ, ఎకనామిక్స్: 20 సీట్లు 4. బీఏ- ఎకనామిక్స్: 20 సీట్లు 5. బీఎస్సీ- కంప్యూటర్ సైన్స్: 45 సీట్లు 6. బీఎస్సీ- మ్యాథ్స్‌: 25 సీట్లు 7. బీఎస్సీ- ఫిజిక్స్: 25 సీట్లు 8. బీఎస్సీ- బోటనీ: 20 సీట్లు 9. బీఎస్సీ- జువాలజీ: 20 సీట్లు 10. బీఎస్సీ- మైక్రోబయాలజీ: 20 సీట్లు 11. బీఎస్సీ- ఆర్గానిక్ కెమిస్ట్రీ: 20 సీట్లు 12. బీఎస్సీ- కెమిస్ట్రీ: 25 సీట్లు అర్హత: మార్చి-2025లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.  ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2025. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేదీ: 18.05.2025. Website:https://www.sjgckurnool.edu.in/ Apply online:https://sites.google.com/sjgckurnool.edu.in/silvercet/home