Posts

Walkins

హొమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో పోస్టులు

హొమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (టీఎంసీ) విశాఖపట్నం వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 12 వివరాలు: 1. సీనియర్‌ సూపర్‌వైజర్‌: 01 2. ప్రాజెక్టు కో-ఆర్డీనేటర్‌: 01 3. ఫీల్డ్‌- ఇన్వెస్టిగేటర్‌: 08 4. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ( కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ సూపర్‌వైజర్‌కు రూ. 23,000 - 60,000, మిగతా పోస్టులకు రూ.21,100 - రూ.45,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 18-02-2025. వేదిక: హొమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, అగనంపూడి, విశాఖపట్నం. Website:https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=33637

Walkins

సీఆర్‌పీఎఫ్‌లో వెటర్నరీ డాక్టర్‌ పోస్టులు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్‌పీఎఫ్‌ సెక్టార్స్‌, యూనిట్స్‌, ఇన్‌స్టిట్యూషన్స్‌లో వెటర్నరీ వైద్యుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 15 వివరాలు: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (వెటర్నరీ సైన్స్‌, యానిమల్‌ హస్బెండరీ) ఉత్తీర్ణులై ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 70 సంవత్సరాలు మించకూడదు. రెమ్యునరేషన్: నెలకు రూ.75,000. ఇంటర్వ్యూ తేదీ: 05-03-2025. వేదిక: మణిపుర్‌, భువనేశ్వర్‌, రాంచీ, ఇంఫాల్‌, ఛత్తీష్‌గఢ్‌, నాగ్‌పుర్‌, బెంగళూరు, శ్రీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ కాంపోజిట్ హాస్పిటళ్లలో. Website:https://rect.crpf.gov.in/

Private Jobs

టెక్ మహీంద్రాలో నెట్‌వర్క్‌ మేనేజర్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ నెట్‌వర్క్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: నెట్‌వర్క్‌ మేనేజర్‌  కంపెనీ: టెక్ మహీంద్రా  అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.  పని అనుభవం: 2 - 5 ఏళ్ల పని అనుభవం. నైపుణ్యాలు: నెట్‌వర్క్‌  ప్రోటోకాల్‌ (network protocols), ప్లానింగ్‌, డిజైన్‌లలో అనుభవంతో పాటు తదితరాల్లో పరిజ్ఞానం ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 31-03-2025. Website:https://careers.techmahindra.com/

Government Jobs

ఎన్ఎస్‌ఐసీలో మేనేజిరియల్‌ పోస్టులు

దిల్లీలోని నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ (ఎన్ఎస్‌ఐసీ) లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 29 వివరాలు: 1. జనరల్ మేనేజర్‌: 04 2. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌- 04 3. చీఫ్‌ మేనేజర్‌- 03 4. డిప్యూటీ మేనేజర్‌- 18 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, సీఏ/ సీఎంఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: జనరల్ మేనేజర్‌కు నెలకు రూ.80,000- రూ.2,20,000; డిప్యూటీ జనరల్ మేనేజర్ కోసం రూ.70,000- రూ.2,00,000; చీఫ్ మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000- రూ.1,40,000. వయసు: జనరల్ మేనేజర్‌ పోస్టుకు 45 ఏళ్లు; డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, కు 41 ఏళ్లు; చీఫ్‌ మేనేజర్‌కు 38 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 31 ఏళ్లు  మించకూడదు. ఎంపిక: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 07.03.2025. Website:https://www.nsic.co.in/Careers/Index

Government Jobs

ఎన్‌ఐఎఫ్‌టీఈఎంలో వివిధ పోస్టులు

తమిళనాడులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌పెన్యూర్‌షిప్‌ అండ్ మేనేజ్‌మెంట్ తంజవూరు (ఎన్‌ఐఎఫ్‌టీఈఎం-టి) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 21 వివరాలు: 1. రిసెర్చ్‌ అసోసియేట్‌: 02 2. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: 11 3. యంగ్‌ ప్రొఫెషనల్: 05 4. కార్పొరేట్‌ రిలేషన్‌ మేనేజర్‌: 01 5. లేడి మెడికల్ డాక్టర్‌: 01 6. ఫుడ్ అనలిస్ట్‌: 01 అర్హత: లేడి మెడికల్ డాక్టర్‌ పోస్టుకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12-02-2025. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05-03-2025. Website:https://niftem-t.ac.in/careerisrf.php

Government Jobs

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్‌) పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్‌) (02/ 2025) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. భారత వాయుసేన- అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్‌) ఇన్‌టేక్‌ 02/2025 వివరాలు: క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, లాన్‌ టెన్నిస్‌, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్/ డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, బాస్కెట్‌బాల్, సైకిల్ పోలో, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు. అర్హత: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2 (మ్యాథ్స్‌, ఫిజిక్స్, ఇంగ్లిష్‌) లేదా ఏదైనా స్ట్రీమ్/ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. లేదా ఇంజినీరింగ్‌లో డిప్లొమా కోర్సు (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలతో పాటు స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ తప్పనిసరి. ఎత్తు: 152 సెం.మీ. కనీస ఎత్తు ఉండాలి. వయోపరిమితి: 03-07-2004 నుంచి 03-01-2008 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు. ఎంపిక ప్రక్రియ: సెలెక్షన్‌ టెస్ట్‌, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.100. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 13-02-2025. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 22-02-2025. రిక్రూట్‌మెంట్ ట్రయల్స్ షెడ్యూల్: 10 నుంచి 12-03-2025 వరకు. ట్రయల్స్ వేదిక: తేజస్ క్యాంప్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూదిల్లీ, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూదిల్లీ. Website:https://agnipathvayu.cdac.in/AV/

Government Jobs

బెల్‌లో సినియర్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన సినియర్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 05 వివరాలు: అర్హత: ఏదైనా పీజీ (హిందీ లేదా ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఉండాలి)ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.30,000- రూ.1,20,000. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.400+జీఎస్‌టీ. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: డిప్యూటీ మేనేజర్, హెచ్‌ఆర్‌, భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ప్లాట్‌ నెం.405, ఇండస్ట్రియల్‌ ఏరియా ఫేజ్‌3, పంచకుల, హరియాణా.చిరునామాకు స్పీడ్‌ పోస్టు ద్వారా పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ: 26-02-2025. Website:https://bel-india.in/

Freshers

క్వాల్‌కామ్‌లో ఆడియో ఇంజినీర్ పోస్టులు

క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ సాఫ్ట్‌వేర్‌ ఎంబెడెడ్ ఆడియో ఇంజినీర్- స్టాఫ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్ట్: సీనియర్ సాఫ్ట్‌వేర్‌ ఎంబెడెడ్ ఆడియో ఇంజినీర్ కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనుభవం: సీ/సీ++ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప్రావీణ్యం, ఏదైనా డీఎస్‌పీ/ఎంబెడెడ్ ప్రాసెసర్‌లో 3+ సంవత్సరాల పని అనుభవం. నైపుణ్యాలు: మల్టీ-థ్రెడ్ ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సాఫ్ట్‌వేర్ డీబగ్గింగ్ నైపుణ్యాలు, డీఎస్‌పీ ప్లాట్‌ఫారమ్‌ ఆడియో/స్పీచ్ ప్రీ/పోస్ట్ ప్రాసెసింగ్ తదితర నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 25.3.2025 Website:https://careers.qualcomm.com/careers?pid=446702544844&domain=qualcomm.com&sort_by=relevance

Admissions

ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ కోర్సులు

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా 12 ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆలిండియా సెలక్షన్‌ టెస్ట్‌-2025 (ఏఐఎస్‌టీ- 2025)లో సాధించిన స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.  మొత్తం సీట్ల సంఖ్య: 2390 వివరాలు: బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌   1. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడీఎస్.) వ్యవధి: 4 సంవత్సరాలు (8 సెమిస్టర్లు) బి.డిఈఎస్. (ఫుట్‌వేర్‌ డిజైన్‌ & ప్రొడక్షన్‌) (B.Des.- FDP) బి.డిఈఎస్. (ఫ్యాషన్ డిజైన్) (B.Des. - FD) బి.డిఈఎస్. (లెదర్, లైఫ్ స్టైల్ అండ్‌ ప్రొడక్ట్ డిజైన్) (B.Des. - LLPD) 2. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) వ్యవధి: 4 సంవత్సరాలు (8 సెమిస్టర్లు) BBA (రిటైల్ & ఫ్యాషన్ మర్చండైజ్) (BBA - RFM) మాస్టర్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ 1. మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండీఎస్‌) వ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు) ఎం.డిఈఎస్‌ (ఫుట్‌వేర్‌ డిజైన్‌ & ప్రొడక్షన్‌) (M.Des.- FDP) ఎం.డిఈఎస్ (ఫ్యాషన్ డిజైన్) (M.Des.-FD) 2. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) వ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు) ఎంబీఏ (రిటైల్ & ఫ్యాషన్ మర్చండైజ్) (MBA - RFM) ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు: నోయిడా, కోల్‌కతా, రోహ్‌తక్‌, ఫుర్సత్‌గంజ్‌, జోధ్‌పుర్‌, చెన్నై, ఛింద్వారా, చండీగఢ్‌, గుణ, అంక్లేశ్వర్‌, హైదరాబాద్‌, పట్న. GATB-2025: జీఏటీ-బీ 2025  అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు టెన్‌+2, మాస్టర్‌ డిగ్రీ కోర్సులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు 25 ఏళ్లు మించకూడదు. పీజీ కోర్సులకు వయోపరిమితి లేదు. ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా సెలక్షన్‌ టెస్ట్‌ (ఏఐఎస్‌టీ-2025) ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ వారికి రూ.300. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20.04.2025. ఆలస్య రుసుముతో దరఖాస్తులకు గడువు తేదీ: 30.04.2025. దరఖాస్తుల సవరణకు తేదీలు: 21, 22 ఏప్రిల్‌ 2025. అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ: 01.05.2025 ఏఐఎస్‌టీ ప్రవేశ పరీక్ష తేదీ: 11.05.2025. మెరిట్‌ మార్కుల వెల్లడి: జూన్‌ 2 - 3వ వారాల్లో. కౌన్సిలింగ్‌ తేదీలు: జూన్‌- జులై క్లాసులు ప్రారంభం: జులై 21. Website:https://fddiindia.com/ Apply online:https://fddiadmissions.qualcampus.com/

Walkins

Posts In ICAR - Rajendranagar

ICAR-Directorate of Poultry Research, Rajendranagar, Hyderabad is conducting interviews to fill the vacant posts of Young Professional. Details: Young Professional -1: 01 Qualification: Degree in relevant discipline (Animal Science, Agriculture, Life Science) along with work experience should follow the post. Age Limit: 21 - 45 years as on 27-02-2025. Salary: per month Rs.30,000 . Selection Process: Based on Interview. Venue: ICAR-DPR, Hyderabad. Date of Interview: 27-02-2025. Website:https://pdonpoultry.org/downloads/recruitments/