Posts

Current Affairs

కుటుంబ తలసరి అప్పు రూ.86,713

2024 మార్చి నాటికి ప్రతి కుటుంబంపై తలసరి రూ.86,713 అప్పు ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి 2025, ఫిబ్రవరి 10న లోక్‌సభలో తెలిపారు. 2019లో రూ.46,898 మేర ఉన్న రుణ భారం అయిదేళ్లలో 85%మేర పెరిగినట్లు వెల్లడించారు.  ఇదే సమయంలో కుటుంబాల పొదుపుశాతం తగ్గినట్లు చెప్పారు. ఇది 2018-19లో జీడీపీలో 20.3%మేర ఉన్న కుటుంబాల పొదుపు నిష్పత్తి, 2019-20లో 19.1%, 2020-21లో 22.7%, 2021-22లో 20.1%కి చేరి 2022-23 నాటికి 18.4%కి తగ్గినట్లు తెలిపారు.  

Current Affairs

ఏరో ఇండియా-2025

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2025, ఫిబ్రవరి 10న బెంగళూరులో 15వ ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనను (ఏరో ఇండియా-2025) ప్రారంభించారు. ‘ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా నిలిచే ఈ షోకు ఈ దఫా ఇతివృత్తం (థీమ్‌) ‘రన్‌ వే ఫర్‌ బిలియన్‌ అపార్చునిటీస్‌’. 90 దేశాల నుంచి 150 కంపెనీలు పాల్గొన్నాయి. 900కు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. అమెరికా, రష్యా తదితర దేశాల యుద్ధవిమానాల విన్యాసాలుంటాయి. 30 దేశాల రక్షణ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. ఫిబ్రవరి 14న విన్యాసాలు ముగుస్తాయి. భారత రక్షణ రంగం ఉత్పాదనపరంగా రూ.1.27 లక్షల కోట్లు, ఎగుమతుల్లో రూ.21 వేల కోట్లు దాటిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.

Walkins

ఐఐపీఆర్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్‌పుర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రిసెర్చ్‌ (ఐఐపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో- 01 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌- 01 అర్హత: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు సంబంధిత విభాగంలో పీజీ  ఉత్తీర్ణతతో పాటు నెట్‌/ గేట్‌/ ఐసీఏఆర్‌-ఎస్‌ఆర్‌ఎఫ్‌ స్కోర్‌, ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.37,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.15,000. వయోపరిమితి: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 18- 35 ఏళ్లు; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు 21- 45ఏళ్లు ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ: 17.03.2025. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఇంటర్వ్యూ వేదిక: ఐసీఏఆర్‌- ఐఐపీఆర్‌ రీజినల్‌ స్టేషన్‌, ఫాండా (టోల్‌ ప్లాజా దగ్గర) భోపాల్‌. Website:https://iipr.icar.gov.in/

Walkins

ఐఏఆర్‌ఐలో సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

దిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: 1. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 02  2. యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 01  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ,  ఉత్తీర్ణతతో పాటు, నెట్‌/ గేట్‌ స్కోర్‌, ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు మొదటి, రెండో ఏడాది రూ.37,000, రెండో ఏడాది రూ.42,000; యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.30,000. వయోపరిమితి: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లు; యంగ్‌ ప్రొఫెషనల్‌కు 21 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా మార్చి 11వ తేదీ వరకు పంపించవచ్చు. ఈమెయిల్:viromeacpv@gmail.com  ఇంటర్య్వూ తేదీ: 13.03.2025. వేదిక: ఐసీఏఆర్‌-ఐఏఆర్‌ఐ, న్యూ దిల్లీ. Website:https://www.iari.res.in/en/index.php

Government Jobs

ఇర్కాన్‌లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (ఇర్కాన్) రెగ్యులర్‌ ప్రాతిపదికన జనరల్‌ మేనేజర్‌ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 5 వివరాలు: 1. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌/ సివిల్‌- 01 2. మేనేజర్‌/ ఫైనాన్స్‌- 02   3. డిప్యూటీ మేనేజర్‌/ ఫైనాన్స్‌- 02 అర్హత: సీఏ/ సీఏంఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు 41 ఏళ్లు; మేనేజర్‌కు 37 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 33 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.70,000 నుంచి రూ.2,00,000. మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ వారికి ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జేజీఎం/ హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, సీ-4, డిస్ట్రిక్ట్‌ సెంటర్‌, సాకేత్‌, దిల్లీ. దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.02.2025. దరఖాస్తు చివరి తేదీ: 07.03.2025. Website:https://www.ircon.org/index.php?lang=en

Government Jobs

సీఎస్‌ఐఆర్‌-సీఎఫ్‌టీఆర్‌ఐలో సైంటిస్ట్‌ పోస్టులు

మైసూర్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్‌-సీఎఫ్‌టీఆర్‌ఐ) సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 35 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌, కెమికల్, డిసైన్‌), పీహెచ్‌డీలో  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు. జీతం: నెలకు రూ.67,700 - రూ.2,08,700. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2025. Website:https://cftri.res.in/

Government Jobs

సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐలో ఉద్యోగాలు

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐ),  లఖ్‌నవూ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్‌ (హిందీ/ ఇంగ్లీష్)  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: 1. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్: 07 2. జూనియర్ స్టెనోగ్రాఫర్‌(హిందీ/ఇంగ్లీష్): 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ వచ్చి ఉండాలి. వయోపరిమితి: మార్చి 10వ తేదీ నాటికి జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్‌(హిందీ/ఇంగ్లీష్)కు 27 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900 - రూ.63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌(హిందీ/ఇంగ్లీష్)కు రూ.25,500 - రూ.81,100. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూపీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-03-2025. Website:https://cdri.res.in/022025/#

Admissions

ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌, అయిదో తరగతి ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను అయిదో తరగతి, ఇంటర్మీడియట్‌, బ్యాక్‌లాగ్‌ (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది.  మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2025 వివరాలు: ప్రవేశాలు: జూనియర్‌ ఇంటర్మీడిట్‌, 5వ తరగతి, బ్యాక్‌లాగ్‌ (6,7,8,9) తరగతుల్లో ప్రవేశాలు విద్యార్హతలు, వయస్సు, ప్రవేశ పరీక్ష విధానం, సీట్ల సంఖ్య, పరీక్ష కేంద్రం, ఎంపిక విధానం, దరఖాస్తు రుసుము తదితర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడగలరు. ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు: 15.02.2025 నుంచి 15.03.2025 వరకు. ఇంటర్మీడియట్‌ పరీక్ష తేదీ: 20.04.2025. 5వ తరగతి ఆన్‌లైన్ దరఖాస్తులు: 15.02.2025 నుంచి 15.03.2025 వరకు.  5వ తరగతి పరీక్ష తేదీ: 27.04.2025. బ్యాక్‌లాగ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు: 15.02.2025 నుంచి 15.03.2025. బ్యాక్‌లాగ్‌ పరీక్ష తేదీ: 28.04.2025. Website:https://mjpapbcwreis.apcfss.in/

Walkins

Posts in TATA MEMORIAL CENTRE (TMC)

Homi Baba Cancer Hospital and Research Center - TMC, Visakhapatnam is conducting interviews for the vacant posts of Secretarial Assistant. Details: Secretarial Assistant: 01 Eligibility: Pursuant to the post should have 10th pass in relevant department along with work experience. Age Limit: 30 years. Salary: per month Rs.19,100. Selection Process: Based on Interview. Date of Interview: 17-02-2025. Venue: Homi Baba Cancer Hospital and Research Centre, Aganampudi, Visakhapatnam. Website:https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=33648

Walkins

Project Assistant Posts In IIPR, Kanpur

ICAR- Indian Institute of Pulses Research, Kanpur, Uttar Pradesh is conducting interviews for the following posts on contractual basis. Details: Senior Research Fellow- 01 Project Assistant- 01 Eligibility: Intermediate or equivalent for the post of Project Assistant, PG in the relevant discipline for the post of Senior Research Fellow along with NET/ GATE/ ICAR-SRF score and work experience. Salary: Per month Rs. 37,000 for Senior Research Fellow; Rs. 15,000 for Project Assistant. Age Limit: 18-35 years for Senior Research Fellow; 21-45 years for Project Assistant. Interview Date: 17.03.2025. Interview Venue for the Post of Project Assistant: ICAR-IIPR Regional Station, Phanda (Near Toll Plaza) Bhopal. Website:https://iipr.icar.gov.in/