Posts

Government Jobs

ఏఎఫ్‌ఎంఎస్‌లో మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు

దిల్లీలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్ సర్వీసెస్‌ (ఏఎఫ్‌ఎంఎస్‌) మెడికల్ ఆఫీసర్‌ పోస్టల  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 400 వివరాలు: 1. మెడికల్ ఆఫీసర్‌(మేల్‌): 300 2. మెడికల్ ఆఫీసర్‌(ఫీమేల్‌): 100 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు జాతీయ వైద్య కమిషన్ చట్టం-2019 ప్రకారం వైద్య అర్హతను కలిగి ఉండాలి. ఏదైనా రాష్ట్ర వైద్య మండలి/ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. రాష్ట్ర వైద్య మండలి ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ ద్వారా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: 32 ఏళ్లు. దరఖాస్తు ఫీజు: 200. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 12. Website: https://join.afms.gov.in/

Current Affairs

సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు

మన దేశం నుంచి సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు 2024-25లో 665.96 మిలియన్‌ డాలర్ల (రూ.5,700 కోట్ల)కు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023-24లో ఎగుమతి చేసిన 494.8 మి.డాలర్ల (సుమారు రూ.4,200 కోట్ల) ఉత్పత్తులతో పోలిస్తే ఇవి 34.6% ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన పప్పుధాన్యాలు, వంటనూనె, తాజా ఫలాలు, కూరగాయలకు గిరాకీ పెరగడమే ఇందుకు కారణం. పరిమాణం పరంగా చూస్తే ఎగుమతులు 4% పెరిగి 3,68,155 టన్నులకు చేరాయి.

Admissions

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌)-పీజీ 2025

న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ(పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌)లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2025 పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ/ ఎంఎస్‌/ పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.  వివరాలు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌)-పీజీ 2025 అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీ/ ప్రొవిజనల్‌ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. పరీక్ష రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2500. పరీక్షా విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో జరుగుతుంది. ఈ పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, అమలాపురం, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, మచిలీపట్నం, నెల్లూరు, నరసరావుపేట, నంద్యాల, తాడిపత్రి, రాజమండ్రి, పుత్తూరు, ప్రొద్దుటూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 07-05-2025. దరఖాస్తు సవరణ తేదీలు: మే 9 నుంచి 13 వరకు. సిటీ ఇంటిమేషన్‌ వివరాలు: జూన్‌ 2. అడ్మిట్‌ కార్డులు విడుదల: జూన్‌ 11. పరీక్ష తేదీ: 15-06-2025. ఫలితాల వెల్లడి: 15-07-2025. Website: https://natboard.edu.in/ Apply online: https://cdn3.digialm.com/EForms/configuredHtml/1815/93433/Index.html

Current Affairs

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నివేదిక

2013 నుంచి 2024 మధ్య కాలంలో భారతీయ ఏఐ రంగంలోకి 11.29 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు  స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ తాజా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికా 470.9 బి.డాలర్లు, చైనా 119.3 బి.డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. యూకే 28.2 బి.డాలర్లను 2024లోనే సంపాదించింది.  నివేదికలోని అంశాలు: * ఏఐ నిపుణుల నియామకాలు, సాంకేతికత అభివృద్ధి కార్యకలాపాల్లో భారత్‌ ఎంతో క్రియాశీలకంగా ఉందని కానీ, ప్రైవేట్‌ రంగం నుంచి ఏఐ పెట్టుబడులు సాధించడంలో భారత్‌ వెనకబడి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. * అంకురాల విషయంలోనూ భారత్‌ ఏమంత ఆశాజనకంగా లేదు. 2024లో కేవలం 74 ఏఐ స్టార్టప్‌లే ఇక్కడ ఆవిర్భవించాయి. అమెరికాలో 1,073, యూకేలో 116, చైనాలో 98 అంకురాలు వచ్చాయి. 

Current Affairs

ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు

ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల రిజర్వేషన్‌ను రెండు నుంచి మూడు శాతానికి పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025, ఏప్రిల్‌ 19న ఉత్తర్వులిచ్చింది. క్రీడల్లో ప్రతిభ కలిగి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన వారికి పోటీపరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వశాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు, పోలీస్, ఎక్సైజ్, అటవీ లాంటి యూనిఫాం శాఖలల్లోనూ క్రీడాకారులకు పెంచిన రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.  * క్రీడా విధానం 2024-29లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లను 2 నుంచి 3 శాతానికి పెంచింది. 

Walkins

Engineering Professionals Posts In RITES Limited

Rail India Technical and Economic Services Limited (RITES), Gurgaon is inviting applications for the following Engineering Professionals posts. No. of Posts: 11 Details: 1. Senior Resident Engineer/ S&T- 01 2. Senior Resident Engineer/ Electrical-General Service- 01 3. Planning and Procurement Engineer- 02 4. Section Engineer/ Civil- 01 5. Drawing and Designing Engineer/ S&T- 01 6. Drawing and Designing Engineer/ Electrical- 01 7. Section Engineer- Electrical- 02 8. QS and Billing Engineer- 01 9. Design Engineer/ Civil- 01 Eligibility: Engineering Degree, Diploma in the relevant discipline as per the post with work experience. Age Limit: Not more than 55 years. Selection Method: Based on Interview. Interview Dates: 28.04.2025- 30.04.2025. Venue: RITES Limited, Shikar, Plot 1, Leisure Valley, RITES Bhavan, Near IFFCO Chowk Metro Station, Gurgaon, Haryana. Website: https://rites.com/Career

Government Jobs

Scientist Posts In DRDO

Defence Research and Development Organisation (DRDO) is inviting applications for the recruitment of Scientist posts.  Number of Posts: 21  Details: 1. Scientist-F: 01 2. Scientist-E: 04 3. Scientist-D: 04 4. Scientist-C: 12 Qualification: B.Tech, BE in the relevant discipline as per the post and work experience. Age limit: 40 years for Scientist-C posts, 50 years for other posts. Salary: Rs.67,700, Rs.78,800, Rs.1,23,100, Rs.1,31,100 per month for Scientist (C, D, E, F) posts. Application Fee: Rs. 100 for General, OBC, EWS candidates, fee is exempted for SC, ST, PWBD candidates. Selection Process: Based on Interview. Last Date of Online Application: 9th May 2025. Website: https://rac.gov.in/index.php?lang=en&id=0

Government Jobs

Medical Officer Posts In AFMS

Armed Forces Medical Services (AFMS) in Delhi is inviting applications for the recruitment of Medical Officer posts.  Number of Posts: 400 Details: 1. Medical Officer (Male): 300 2. Medical Officer (Female): 100 Qualification: Candidates should have medical qualification in the relevant category as per the National Medical Commission Act-2019. Should have permanent registration from any State Medical Council/MCI/NBE/NMC. Post Graduate Degree holders recognized by State Medical Council MCI/NBE/NMC can also apply. Age Limit: 32 years. Application Fee: 200. Selection Process: Based on Interview. Application Closing Date: 12th May 2025. Website: https://join.afms.gov.in/

Admissions

National Eligibility cum Entrance Test (NEET)-PG 2025

NEET-PG 2025 is an eligibility-cum-entrance examination prescribed as the single entrance examination for admission to various MD/ MS and PG Diploma Courses  for the academic session 2025-26. Admissions to Post MBBS DNB Courses, Post MBBS Direct 6 year DNB courses and NBEMS diploma courses are also undertaken through NEET-PG. Details: National Eligibility cum Entrance Test (NEET)-PG 2025 Eligibility: MBBS degree or Provisional MBBS And have Completed one year of internship or are likely to complete the internship on or before 31st July 2025. Examination Fee: General, OBC and EWS Rs.3500. SC, ST, PWD Rs.2500. Exam Cetres in AP/TS States: Hyderabad, Karimnagar, Mahabubnagar, Peddapalli, Suryapet, Khammam, Warangal, Amalapuram, Anantapur, Bhimavaram, Chittoor, Eluru, Guntur, Kakinada, Kadapa, Kurnool, Machilipatnam, Nellore, Narasaraopet, Nandyal, Tadipatri, Rajahmundry, Puttur, Proddatur, Ongole, Tadepalligudem, Tirupati, Vizianagaram, Visakhapatnam, Vijayawada. Last date for online applications: 07-05-2025. City intimation details: June 2. Admit cards released: June 11. Examination date: 15-06-2025. Results declared: 15-07-2025. Website: https://natboard.edu.in/ Apply online: https://cdn3.digialm.com/EForms/configuredHtml/1815/93433/Index.html

Current Affairs

రెవెన్యూ కార్యదర్శిగా అరవింద్‌ శ్రీవాస్తవ

కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ శ్రీవాస్తవ 2025, ఏప్రిల్‌ 18న నియమితులయ్యారు. 1994 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీవాస్తవ, ప్రస్తుతం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పౌరవిమానయాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీర్‌ కుమార్‌ సిన్హా నియమితులయ్యారు. ఈయన అసోం-మేఘాలయా క్యాడర్‌కు చెందినవారు.