Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Apprenticeship

Apprentice Posts in Yantra India Limited

Yantra India Limited (YIL) is inviting applications to fill apprentice posts in various departments.  Number of Posts: 3,979 Details: 1. Ex-ITI Trade Apprentice: 2,843 2. Non-ITI Trade Apprentice: 1136 Departments: Machinist, Fitter, Electrician, Turner, Welder. Eligibility: Depending on the post, candidates must have passed 10th class and ITI in the relevant trade. Age Limit: As of March 3rd, 2026, candidates must be between 14 and 35 years of age. There is a relaxation of 3 years for OBCs, 5 years for SC/ST candidates, and 10 years for PwBD candidates. Stipend: Rs. 8,200 - Rs. 9,600 per month. Application fee: Rs. 500; No fee for SC/ST/PwBD candidates. Selection Process: Based on merit achieved in educational qualifications and interview. Application process: Online. Application start date: February 1, 2026. Last date for online application submission: March 3, 2026. Website: https://www.recruit-gov.com/

Government Jobs

విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

 నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐఎన్‌టీ) నాన్‌ అకాడమిక్‌ పోస్టులైన లైబ్రేరియన్‌, సీనియర్‌ సైంటిఫిక్‌/టెక్నికల్‌ ఆఫీసర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌, జూనియర్‌ ఇంజినీరింగ్‌, సీనియర్‌ ఇంజినీరింగ్‌, టెక్నీషియన్‌ తదితర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 45 వివరాలు: 1. లైబ్రేరియన్: 01 2. సీనియర్‌ సైంటిఫిక్‌/టెక్నికల్‌ ఆఫీసర్‌: 02 3. సైంటిఫిక్‌/టెక్నికల్‌ ఆఫీసర్‌: 03 4. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌: 01 5. సూపరిటెండెంట్‌: 05 6. లైబ్రరీ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 01 7. జూనియర్‌ ఇంజినీర్‌: 01 8. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 08 9. సీనియర్‌ అసిస్టెంట్‌: 02 10. సీనియర్‌ టెక్నీషియన్‌: 03 11. జూనియర్‌ అసిస్టెంట్‌: 03 12. టెక్నీషియన్‌: 10 13. ఆఫీస్‌ అటెండెంట్‌/ల్యాబ్‌ అటెండెంట్‌: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్‌ డిగ్రీ,  బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఉత్తర్ణతతో పాటు ఉద్యోగానుభం ఉండాలి. జీతం: నెలకు రూ.18,000- రూ.1,44,200. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 01.03.2026. Website: https://vnit.ac.in/

Government Jobs

టిస్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ (టిస్‌) ఒప్పంద ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 11 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2026 జనవరి 31వ తేదీ నాటికి 35 ఏళ్ల లోపు ఉండాలి. జీతం: నెలకు రూ.25,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.125. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 8. Website: https://tiss.ac.in/project-positions/

Government Jobs

హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) రాజస్థాన్‌ రాష్ట్రం ఖేత్రీ కాపర్‌ కాంప్లెక్స్‌లో  చార్జ్‌మ్యాన్‌, ఎలక్ట్రీషియన్‌, డబ్ల్యూడీ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 18 వివరాలు: చార్జ్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌): 04  ఎలక్ట్రీషియన్‌ ‘ఏ’: 02 ఎలక్ట్రీషియన్‌ ‘బి’: 03 డబ్ల్యూడీ ‘బి’: 04 డబ్ల్యూడీ ‘సి’: 05 అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేట్‌ (బీఏ/బీఎస్సీ/బీకాం) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవంఉండాలి. జీతం: నెలకు చార్జ్‌మ్యాన్‌కు రూ.28,740- రూ.72,110; ఎలక్ట్రీషియన్‌ ‘ఏ’కు రూ.28,430- రూ.59,700; ఎలక్ట్రీషియన్‌ ‘బి’, డబ్ల్యూడీ ‘బి’కు రూ.28,280-  రూ.57,640; డబ్ల్యూడీ ‘సి’కు రూ.28,120- రూ.55,620. వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, ఎబిలిటీ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-02-2026. Website: https://www.hindustancopper.com/

Government Jobs

ఎయిమ్స్ రిషికేశ్‌లో ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులు

దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: ఫీల్డ్ డేటా కలెక్టర్ - 06 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. జీతం: నెలకు రూ.20,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా cotpauttarakhand2023@gmail.com కు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ: 30.01.2026.  Website: https://www.aiims.edu/index.php/en/notices/recruitment/aiims-recruitment

Government Jobs

ఏబీవీ ఐఐఐటీఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

అటల్ బిహారీ వాజ్‌పేయీ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఏబీవీ-ఐఐఐటీఎం) గ్వాలియర్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: అసిస్టెంట్ ప్రోఫెసర్ - 22 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి. జీతం: నెలకు రూ.57,700 – రూ.98,200. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: జాయింట్ రిజిస్ట్రార్ (ఎ&ఎ), ఏబీవీ-ఐఐఐటీఎం గ్వాలియర్, మోరెనా లింక్ రోడ్, గ్వాలియర్ - 474015. దరఖాస్తు చివరి తేదీ: 25/02/2026.  Website: https://www.iiitm.ac.in/index.php/en/component/content/article/98-recruitment/1625-advertisement-for-faculty-positions-assistant-professor-pay-level-10-last-date-to-apply-is-25-02-2026?Itemid=437

Apprenticeship

యంత్ర ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

యంత్ర ఇండియా లిమిటెడ్‌ (వైఐఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 3,979 వివరాలు: 1. ఎక్స్‌-ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌: 2,843 2. నాన్‌-ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌: 1136 విభాగాలు: మెషినిస్ట్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, వెల్డర్‌.  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.  వయోపరిమితి: 2026 మార్చి 3వ తేదీ నాటికి 14 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. స్టైపెండ్‌: నెలకు రూ.8,200 - రూ.9,600. దరఖాస్తు ఫీజు: రూ 500; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 1. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 3.  Website: https://www.recruit-gov.com/

Current Affairs

బులెటిన్‌ ఆఫ్‌ ద అటామిక్‌ సైంటిస్ట్స్‌

ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా విధ్వంసానికి చేరువైందని ‘బులెటిన్‌ ఆఫ్‌ ద అటామిక్‌ సైంటిస్ట్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. అమెరికా, రష్యా, చైనా, ఇతర దేశాలు దుందుడుకుగా వ్యవహరించడం, శత్రుభావాలు, జాతీయవాదం పెరగడం వంటివి ఇందుకు కారణమని వివరించింది. దీంతో ‘డూమ్స్‌డే గడియారం’లో అర్ధరాత్రికి 85 సెకన్ల దూరంలోనే ఉంది. వినాశనానికి మానవాళి ఎంత దూరంలో ఉందన్నది బులెటిన్‌ ఆఫ్‌ ద అటామిక్‌ సైంటిస్ట్స్‌ విశ్లేషిస్తుంది. ఒక ఊహాజనిత గడియారంపై అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని వినాశనానికి సూచికగా అభివర్ణిస్తుంది.  దీన్ని డూమ్స్‌డే క్లాక్‌గా పిలుస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ సమయాన్ని ముందుకు, వెనక్కి జరుపుతుంటుంది. 2025లో గడియారాన్ని అర్ధరాత్రికి 89 సెకన్లకు చేరువ చేసింది. అణ్వస్త్ర దేశాలతో ప్రమేయమున్న ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని సంస్థ తెలిపింది.   

Current Affairs

దేశీయంగా విమానాల తయారీ

దేశంలో అత్యధిక డిమాండ్‌ ఉన్న 80-150 సీట్ల విమానాలను భారత్‌లోనే తయారుచేసే వ్యవస్థ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్, బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయెర్‌ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు 2026, జనవరి 27న వెల్లడించారు. దేశీయ అవసరాలకు తగ్గట్టు, స్థానికంగా విమానాలు తయారుచేసుకోవడానికి ఎంఓయూ వీలు కల్పిస్తుంది. దీని ప్రకారం అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్, ఎంబ్రాయెర్‌ కలిసి దేశంలో విమాన తయారీ కేంద్రం ఏర్పాటుచేస్తాయి. దేశీయంగా విమానాలను అసెంబ్లింగ్‌ చేయడమే కాదని, సాంకేతికతను కూడా ఎంబ్రాయెర్‌ బదిలీ చేస్తుందని పౌరవిమానయాన శాఖ తెలిపింది.  

Current Affairs

ఆర్థిక సర్వే అంచనాలు

మనదేశ ఆర్థిక వృద్ధి గణాంకాలను పరిశీలిస్తే, ఆర్థిక సర్వేలో ప్రకటించిన అంచనాలను తరచుగా అధిగమిస్తున్నాయి. బడ్జెట్‌ ముందస్తు పత్రం (ప్రీ-బడ్జెట్‌ డాక్యుమెంట్‌)లో అంచనా వేసిన 6.3-6.8%  వృద్ధికి మించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధిరేటు నమోదవుతుందని అంచనా. 2023-24 ఆర్థిక సర్వేలో జీడీపీ వృద్ధి 6-6.8 శాతమని అంచనా వేయగా, అది 9.2 శాతంగా నమోదైంది.  2024-25లో మాత్రం ఆర్థిక సర్వే అంచనా 6.5-7 శాతానికి అనుగుణంగా, 6.5 శాతంగా నమోదైంది. 2022-23లో లక్ష్యం నెరవేరలేదు. వాస్తవిక ఆర్థిక వృద్ధి 7.65% ఉండగా, ఆర్థిక సర్వే అంచనా 8-8.5 శాతంగా ఉంది. 2021-22లో కొవిడ్‌ కారణంగా ఆర్థిక సర్వే ఎలాంటి అంచనాలను వేయలేదు. కానీ బేస్‌ ప్రభావం కారణంగా 9.7% వృద్ధి నమోదైంది.