ముంబయికి చెందిన ఆరవ్ (17 ఏళ్లు) గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. మన దేశం నుంచి జీఎం అయిన 93వ ఆటగాడిగా అతడు సాధించాడు. బోస్నియాలో జరిగిన జీఎం మిక్స్ బిజెల్‌జినా టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా.. గ్రాండ్‌మాస్టర్ హోదాకు అవసరమైన చివరి నార్మ్‌ను ఆరవ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 2506 ఎలో పాయింట్లు ఉన్నయి. ఆరవ్ 2022లో ఫిడే మాస్టర్, 2024లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాలు దక్కించున్నాడు.