లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బిహార్‌లోని పట్నాలో 2025, జనవరి 20న 85వ అఖిల భారత సభాధ్యక్షుల సదస్సును ప్రారంభించారు.
రాష్ట్రాల అసెంబ్లీలు సమావేశమయ్యే రోజుల సంఖ్య తగ్గుతుండటం ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకుగానూ అసెంబ్లీ స్పీకర్లు ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.