ఆసియా క్రీడల రజత విజేత మహమ్మద్ అఫ్జల్.. 800 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. 2025, మే 9న జరిగిన యూఏఈ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో 800.మీ రేసును అఫ్జల్ 1 నిమిషం 45.61 సెకన్లలో పూర్తి చేసి రజతం సాధించాడు. ఈ క్రమంలో జిన్సన్ జాన్సన్ 2018లో 1 నిమిషం 45.65 సెకన్లతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.