ఐరోపా సమాఖ్య (ఈయూ)లోని దేశాలు తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు 800 బిలియన్ యూరోల (841 బిలియన్ డాలర్ల)తో ప్రణాళిక ప్రతిపాదించాయి.
ఒకవేళ ఉక్రెయిన్‌కు అమెరికా సాయం నిలిచిపోతే ఎదురయ్యే పరిణామాలను దృష్టిలోపెట్టుకుని జెలెన్‌స్కీకి బాసటగా నిలిచేలా ఈ మేరకు సమాయత్తం అవుతున్నాయి.
ఉక్రెయిన్‌కు ఈ ప్రణాళిక సాయపడుతుందని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ చెప్పారు. ఈయూ 27 దేశాల కూటమి.