మానవుల్లో కార్బోహైడ్రేట్ల జీర్ణానికి సాయపడే జన్యువుల పరిణామక్రమం సుమారు 8లక్షల ఏళ్ల కిందటే మొదలైందని ఇటీవలి అధ్యయనం తేల్చింది. మనుషులు వ్యవసాయం మొదలుపెట్టడానికి చాలాకాలం ముందే ఈ పరిణామం జరిగినట్లు తెలిపింది. 68 పురాతన మానవ జన్యుక్రమాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇందులో సైబీరియా నుంచి సేకరించిన 45వేల ఏళ్ల నాటి నమూనా కూడా ఉంది.
* ఒక జన్యువు తన ప్రతిని తయారుచేసుకొని, స్వీయ సంఖ్యను పెంచుకోవడాన్ని జీన్ డూప్లికేషన్‌గా పిలుస్తారు. పరిణామక్రమానికి ఇది పెద్ద ఊతమిస్తుంది.