Published on Oct 29, 2025
Current Affairs
8వ వేతన సవరణ సంఘం విధివిధానాలు
8వ వేతన సవరణ సంఘం విధివిధానాలు

ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి 8వ వేతన సవరణ సంఘం విధివిధానాల (టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌)కు 2025, అక్టోబరు 28న ఆమోద ముద్రవేసింది. ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశాయ్‌ నియమితులయ్యారు. ఇందులో తాత్కాలిక సభ్యుడిగా బెంగుళూరు ఐఐఎం ప్రొఫెసర్‌ పులాక్‌ ఘోష్, సభ్య కార్యదర్శిగా కేంద్ర పెట్రోలియం-సహజవాయువుల శాఖ కార్యదర్శి పంకజ్‌ జైన్‌ ఉంటారు. ఈ సంఘం 18 నెలల్లో తమ తుది నివేదికను సమర్పిస్తుంది.