Published on Nov 5, 2025
Current Affairs
8వ వేతన సవరణ సంఘం ఏర్పాటు
8వ వేతన సవరణ సంఘం ఏర్పాటు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలో 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ 2025, నవంబరు 4న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సంఘం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ విభాగాలు, ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి నగదు, ఇతరత్రా రూపాల్లో అందించే వేతనాలు, భత్యాలు, ఇతర సౌకర్యాలు, ప్రయోజనాల హేతుబద్ధీకరణపై పరిశీలన జరిపి వాటిలో చేయాల్సిన మార్పులు, విభిన్న విభాగాలకు కావాల్సిన ప్రత్యేక అవసరాల గురించి సిఫార్సు చేస్తుంది.