Published on Jan 16, 2026
Current Affairs
75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ నిలిపివేత
75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ నిలిపివేత

 పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా సహా మొత్తం 75 దేశాల పౌరులకు తమ దేశ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రభుత్వ 2026, జనవరి 14న ప్రకటించింది. ఆ దేశాలవారు అమెరికా ప్రభుత్వ పథకాలపైనే ఎక్కువగా ఆధారపడి జీవించే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఈ చర్యకు ఉపక్రమించామని తెలిపింది. కొత్త వలసదారులు అమెరికన్ల సంపదను సంగ్రహించకుండా రక్షణ కల్పించేంతవరకూ, వారు మాకు భారంగా మారరని నిర్ధారణ అయ్యేంతవరకూ ఈ నిలిపివేత అమల్లో ఉంటుందని పేర్కొంది.