తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌లతో కలిసి సీఎం చంద్రబాబు 2025, డిసెంబు 26న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.