Published on Apr 6, 2025
Current Affairs
50 ఏళ్ల మైక్రోసాఫ్ట్‌
50 ఏళ్ల మైక్రోసాఫ్ట్‌

ప్రపంచంలోని దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల సంస్థ మైక్రోసాఫ్ట్‌ 50 వసంతాలను పూర్తి చేసుకుంది.

విండోస్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌ల ద్వారా వ్యక్తిగత కంప్యూటర్ల (పీఎస్‌) విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఈ సంస్థను 1975, ఏప్రిల్‌ 4న బిల్‌గేట్స్, పాల్‌ అలెన్‌ స్థాపించారు.

ఆల్టెయిర్‌ 8800 కంప్యూటర్‌కు సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయాలన్న వీరిద్దరి ఆలోచనతో ఈ సంస్థ ప్రయాణం ప్రారంభమైంది.

ఆ తర్వాత ఎంఎస్‌-డాస్‌ను తీసుకొని రావడం ద్వారా పీఎస్‌ల ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విభాగాన్ని శాసించే స్థాయికి మైక్రోసాఫ్ట్‌ ఎదిగింది.

1980 నుంచి 2021 మధ్య ఎంఎస్‌-డాస్‌లో 9 ప్రధాన వెర్షన్‌లను, విండోస్‌లో 15 వెర్షన్‌లను మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చింది.

1986లో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన ఈ కంపెనీ.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్లలోనూ ఒకటిగా ఉంది.