- గత అయిదేళ్లలో (2020-21 నుంచి 2024-25) 2,04,268 ప్రైవేటు కంపెనీలు మూతపడ్డాయని ప్రభుత్వం తెలిపింది. విలీనం, బదిలీ, రద్దు, కంపెనీల చట్టం 2013 కింద రికార్డుల నుంచి తొలగింపు లాంటి వేర్వేరు కారణాలతో ఈ కంపెనీలు మూతపడ్డాయని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభలో వెల్లడించారు.
- 2021-22 నుంచి అయిదేళ్లలో 1,85,350 కంపెనీలను అధికారిక రికార్డుల నుంచి తొలగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025-26) జులై 16 వరకు 8,648 కంపెనీలను తొలగించారు.