- అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్‌లోని ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు దాన్ని పునఃసృష్టించారు. ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పేరిట భారత నౌకాదళంలో చేరిన ఈ తెరచాప పడవ.. 2025, డిసెంబరు 29న గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు పయనమైంది. ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య తయారీలో మొత్తం పురాతన విధానాలనే అవలంబించారు.
- లోహాలు, మేకులను ఉపయోగించలేదు. చెక్కలను వాడారు. వీటిని కొబ్బరి పీచుతో తయారుచేసిన తాళ్లతో గుదిగుచ్చారు. అందువల్ల ఈ నౌకను ‘స్టిచ్డ్ షిప్’గా పిలుస్తున్నారు. సముద్ర ఉప్పునీటి నుంచి రక్షణ కోసం దీనికి సహజసిద్ధ జిగురుపూతను వేశారు. ఈ నౌకలో ఇంజిన్ ఉండదు. తెరచాపల సాయంతో ప్రయాణిస్తుంది.