జలజీవన్ మిషన్‌లో ప్రజలకు రక్షిత నీటిసరఫరా కోసం ఉమ్మడి జిల్లాల్లో 38 నీటివనరులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది.
వీటిని పథకానికి అనుసంధానించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
వేసవిలోనూ ప్రజలకు తలసరి రోజూ 55 లీటర్ల నీరు సరఫరా చేసేలా పథకాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నారు.
అంచనా వ్యయందాదాపు రూ.60 వేల కోట్లకు పెరిగే ఈ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వ ఆమోదం తీసుకుని పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మిషన్ లక్ష్యాలివి:
గ్రామాల్లో 95.44 లక్షల ఇళ్లకు కుళాయిల ద్వారా తలసరి రోజూ 55 లీటర్ల రక్షిత నీటి సరఫరా.
వేసవిలోనూ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా 38 జలాశయాలు, నదుల నుంచి నీటిసేకరణ.
రూ.60వేల కోట్లకు పెరిగే ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేంద్రప్రభుత్వ ఆమోదంతో పనులు ప్రారంభించి 2028 నాటికి పూర్తిచేయాలి.