Published on Mar 17, 2025
Current Affairs
32-బిట్‌ మైక్రోప్రాసెసర్‌
32-బిట్‌ మైక్రోప్రాసెసర్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం, చండీగఢ్‌లోని సెమీకండక్టర్‌ లేబొరేటరీ (ఎస్‌సీఎల్‌) సంయుక్తంగా 32-బిట్‌ మైక్రోప్రాసెసర్‌ను అభివృద్ధి చేశాయి.

దీన్ని అంతరిక్ష రంగంలో వివిధ అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ సాధనానికి ‘విక్రమ్‌ 3201’ అని పేరు పెట్టారు. దీన్ని పూర్తిస్థాయి భారత పరిజ్ఞానంతో రూపొందించామని ఇస్రో తెలిపింది.