అయోధ్యలోని అంతర్జాతీయ ‘రామకథ’ గ్రంథాలయానికి 233 ఏళ్ల కిందటి అరుదైన వాల్మీకి రామాయణం (తత్వదీపికతో) సంస్కృత రాతప్రతులను కానుకగా అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహేశ్వర తీర్థ శాస్త్రీయ వ్యాఖ్యానం (టీకా)తో ఉన్న 1792 నాటి ఈ వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం (దేవనాగరి లిపి)లో రాసి ఉంది. తాత్వికత లోతును ప్రతిబింబించే ఈ ఇతిహాసం బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే అయిదు విభాగాలుగా ఉంది.