దేశవ్యాప్తంగా 21వ పశుగణన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2024, అక్టోబరు 25న ప్రారంభించింది. 2025 ఫిబ్రవరి వరకు ఈ లెక్కింపు కొనసాగనుంది. ఇందుకోసం రూ.200 కోట్లు వ్యయం చేయనుంది.
పశువులకు ఆరోగ్య భద్రత కల్పించే దిశగా విధానాల రూపకల్పన చేసేందుకు ఈ డేటా దోహదపడుతుందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు.
పశు పోషణ రంగంలో అధిక వృద్ధిని సాధించేందుకూ అది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మంది క్షేత్రస్థాయి అధికారులు పశుగణన ప్రక్రియలో పాల్గొంటారని వెల్లడించారు.