అహ్మదాబాద్‌కు 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను 2025, నవంబరు 26న అధికారికంగా కట్టబెట్టారు. కామన్వెల్త్ స్పోర్ట్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కామన్వెల్త్ క్రీడల ఎగ్జిక్యూటివ్ బోర్డు అక్టోబరులో అహ్మదాబాద్ పేరును సిఫారసు చేసింది.
ఇంతకుముందు 2010లో భారత్ దిల్లీలో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. అందుకోసం రూ.70 వేల కోట్లు ఖర్చుచేసింది.
2030లో 15-17 క్రీడల్లో పోటీలు నిర్వహించాలని భారత్ భావిస్తోంది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్ ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది.