చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-4 ప్రయోగాన్ని 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ 2025, ఫిబ్రవరి 6న తెలిపారు.
అందులో భాగంగా ఎల్‌వీఎం-3 రాకెట్‌ను కనీసం రెండుసార్లు ప్రయోగించి చంద్రయాన్-4 మిషన్‌కు సంబంధించిన అయిదు భిన్న భాగాలను నింగిలోకి పంపిస్తామన్నారు.
భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను 2026లో చేపడతామని తెలిపారు.
దానిలో భాగంగా తొలి మానవరహిత (రోబోను పంపిస్తారు) మిషన్ ‘వ్యోమమిత్ర’ను 2025లోనే నిర్వహిస్తామన్నారు.