ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జీడీపీ వృద్ధి 7.4%, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో 7 శాతంగా నమోదుకావొచ్చని ఫిచ్ గ్రూప్ కంపెనీ బీఎంఐ అంచనా వేసింది. సానుకూల విధాన నిర్ణయాలు భారత్‌కు అండగా నిలవొచ్చని పేర్కొంది. ద్రవ్య పరపతి నిర్ణయాలు, నియంత్రణపరమైన చర్యలు పెట్టుబడులకు, వినియోగం పెంచేందుకు దోహదపడతాయని తెలిపింది.
ఇంతకు ముందు అంచనాల్లో 2025-26లో 7.2%, 2026-27లో 6.6% వృద్ధిరేటు లభించొచ్చని పేర్కొంది. ఇప్పుడు ఈ అంచనాలు పెంచింది.