భారత వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. తద్వారా జీ-20 దేశాల్లో అత్యంత వేగవంత వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. దేశీయంగా బలమైన గిరాకీ పరిస్థితులు, విధానపరమైన నిర్ణయాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో స్థిరత్వం లాంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని విశ్లేషించింది.