2026, ఆగస్టులో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు దిల్లీ ఆతిథ్యమివ్వనుంది.
2025లో పారిస్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఆగస్టు 31న ముగిసింది.
ఆ వెంటనే బీడబ్ల్యూఎఫ్ తర్వాతి టోర్నీకి దిల్లీని వేదికగా ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.
భారత్ చివరగా 2009లో ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది.
అప్పుడు హైదరాబాద్‌లో ఇది జరిగింది.