కామన్వెల్త్ క్రీడల్లో హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్ లాంటి క్రీడలను 2026 గ్లాస్గో గేమ్స్ రోస్టర్ నుంచి తప్పించారు. ఖర్చును తగ్గించుకోవడం కోసం పది ఆటల్లో మాత్రమే పోటీలు నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రయథ్లాన్‌లు కూడా రోస్టర్‌లో చోటు కోల్పోయాయి. క్రీడలు మొత్తం నాలుగు వేదికల్లో మాత్రమే జరగనున్నాయి. అవి: స్కాట్‌స్టౌన్ స్టేడియం, టాల్‌క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్, ఎమిరేట్స్ ఎరీనా, స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్.
2022 బర్మింగ్‌హామ్ సీడబ్ల్యూజీలో 19 ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు.
గ్లాస్గో క్రీడల్లో అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్, నెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో, బౌల్స్ పారా బౌల్స్, 3×3 బాస్కెట్‌బాల్, 3×3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్‌లో పోటీలు ఉంటాయి అని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య తెలిపింది.