2026లో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉంటుందని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) 2025, ఏప్రిల్ 30న ధ్రువీకరించింది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లుంటాయి. అయిచి ప్రిఫెక్చర్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆసియా క్రీడల్లో క్రికెట్ టోర్నీ నిర్వహించడం ఇది నాలుగో సారి. ఇంతకుముందు 2010, 2014, 2023లో నిర్వహించారు. భారత పురుషులు, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్స్.