ఈ ఏడాది (2026)లో భారత వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదుకావొచ్చని ఐక్యరాజ్యసమితి (ఐరాస) అంచనా వేసింది. అమెరికా సుంకాల ప్రభావాన్ని స్థిరమైన ప్రైవేట్ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు భర్తీ చేస్తాయని తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ పేరిట ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను విడుదల చేసింది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2026లో 2.7% వృద్ధి చెందొచ్చని ఈ నివేదిక పేర్కొంది.