ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా నమోదవుతుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేసింది. భౌగోళిక-రాజకీయ సమస్యలు స్వల్పకాలంలో ప్రభావం చూపినా, వాటిని అధిగమించే సత్తా దేశ ఆర్థిక వ్యవస్థకు ఉందని సీఐఐ అంచనా వేసింది. వాణిజ్య అవరోధాలు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి కీలక వాణిజ్య భాగస్వాములతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను మన దేశం కుదుర్చుకోవాలని సూచించింది.