ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) వివిధ రంగాలకు రూ.6.60 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 22శాతం అదనంగా రుణ ప్రణాళికను రూపొందించింది. సచివాలయంలో 2025, ఏప్రిల్ 29న జరిగిన 231వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2025-26 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.
ఎంఎస్‌ఎంఈ రంగానికి గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) రూ.87 వేల కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. రూ.95,620 కోట్లు ఇచ్చినట్లు బ్యాంకర్లు వివరించారు. వ్యవసాయ రుణాల్లో 116 శాతం వృద్ధి సాధించామని.. గతేడాది ఖరీఫ్‌లో రూ.1,69,177 కోట్లు, రబీలో రూ.1,37,291 కోట్లు రుణంగా అందించామని నివేదించారు