2025-26 ఆర్థిక సర్వేను 2026, జనవరి 29న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సర్వే రూపొందింది. అంతర్జాతీయంగా ఒడుదొడుకులు, వాణిజ్య ముప్పులు వెంటాడుతున్నా భారత్‌లో వచ్చే ఏడాది (2027) ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీయనుందని ఆర్థిక సర్వే వెల్లడించింది.
2026-27 ఏడాదిలో ఆర్థిక వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% మధ్య ఉండవచ్చని తెలిపింది. అయితే వినియోగం, పెట్టుబడుల్లో స్వల్ప తగ్గుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది (2025-26) వృద్ధి రేటైన 7.4% కంటే వచ్చే ఏడాది స్వల్పంగా నెమ్మదించనుంది.