Published on Dec 19, 2024
Current Affairs
2025-26లో 6.6% వృద్ధి
2025-26లో 6.6% వృద్ధి

వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి చెందే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌-రా) అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 6.4% కంటే ఇది ఎక్కువ. 

రిటైల్‌ ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2024-25 అంచనా 4.9 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. 

వాణిజ్య లోటు 2025-26లో 308 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.25.87 లక్షల కోట్ల)కు చేరొచ్చని తెలిపింది.