మన దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6.3 శాతంగా నమోదు కావొచ్చని ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదిక అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా వేసిన 6.5 శాతం కంటే ఇది తక్కువ. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి 6.8-7 శాతం మధ్య నమోదు కావొచ్చని ఎస్‌బీఐ రిసెర్చ్ తెలిపింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 6.5 శాతం, అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 6.3 శాతం, జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1 శాతంగా వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది.